జనసేన పార్టీ గ్లాస్ సింబల్( Janasena Glass Symbol ) రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు పిటిషన్ పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
అయితే గాజు గ్లాస్ సింబల్ ను తమకు కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ( Rashtriya Praja Congress Party ) ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్( Election Commission ) ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది.
ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఇక జనసేనను రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ గతంలో పొందిన గాజు గ్లాస్ గుర్తును కోల్పోయింది.







