ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.ఈ కేసులో అరెస్ట్ అయిన మాగుంట రాఘవరెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
ఈ మేరకు బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 6వ తేదీన వెలువరించనుంది.అయితే మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 10వ తేదీన మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం మాగుంట రాఘవ రెడ్డి తీహార్ జైలులో ఉన్నారు.