Adivi Sesh: పెళ్లికి రెడీ అయిన అడివి శేష్.. అమ్మాయి ఆమెనేనా..?

ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి బాట పాడుతున్నారు.రీసెంట్ గా వరుణ్ తేజ్ ( Varun tej ) కూడా తాను ప్రేమించిన లావణ్య త్రిపాటి మెడలో మూడు ముళ్ళు వేశారు.

 Adivi Sesh Who Is Ready For Marriage Is She The Girl-TeluguStop.com

అలాగే ఈ ఏడాది శర్వానంద్ ( Sharwanand ) కూడా ఒక ఇంటివాడయ్యాడు.ఇక టాలీవుడ్ లో రామ్ పోతినేని, విశ్వక్ సేన్, నవీన్ పొలిశెట్టి, విజయ్ దేవరకొండ,అడివి శేష్ వంటి ఇంకా కొంతమంది ఉన్నారు.

అలాగే హీరోయిన్స్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.ఇప్పటికే తమన్నా విజయ్ వర్మతో, రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భాగ్నానితో, రష్మిక విజయ్ దేవరకొండ తో, శృతిహాసన్ శాంతాను హాజరికతో రిలేషన్ లో ఉన్నట్టు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

</br

అయితే తాజాగా టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం. అడివి శేష్ ( Adivi Sesh ) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట.

అయితే జూన్ లోనే ఈయన నిశ్చితార్థం పెళ్లి అంటూ వార్తలు వచ్చినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు.ఇక అడివి శేష్ పెళ్లి చేసుకునే అమ్మాయి అంటే అందరికీ అక్కినేని నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియనే గుర్తుకు వస్తుంది.

ఇక సుప్రియ కి మొదట పెళ్ళై విడాకులు అయినా సంగతి మనకు తెలిసిందే.</br

Telugu Adivi Sesh, Adivisesh, Goodachari, Sharwanand, Lavanya Tripati, Varun Tej

అయితే గూఢచారి సినిమా ( Goodachari movie ) లో నటించినప్పటినుండి అడివి శేష్ కి సుప్రియ కి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడి ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి.అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీలో జరిగే చాలా ఫంక్షన్లకి అడివి శేష్ వెళ్లడం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం,వీరి మధ్య రిలేషన్ గురించి మీడియాలో అనేక వార్తలు రావడం మనం చూసే ఉంటాం.అయితే ఇప్పటికే సుప్రియకు పెళ్లి కావడంతో అటు అక్కినేని ఫ్యామిలీ ఇటు అడివి శేష్ ఫ్యామిలీ కాస్త తట పటాయించినట్టు తెలుస్తోంది.</br

Telugu Adivi Sesh, Adivisesh, Goodachari, Sharwanand, Lavanya Tripati, Varun Tej

ఇక ఎట్టకేలకు వీరిద్దరి ఫ్యామిలీలు అడివి శేష్ సుప్రియ ( Supriya ) పెళ్ళికి ఒప్పుకున్నారని,త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు తెలుస్తోంది.అయితే ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం డిసెంబర్ 22న వీరిద్దరి ఎంగేజ్మెంట్ సింపుల్ గా జరగబోతున్నట్టు సమాచారం.మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube