ఈ మధ్యకాలంలో అడవి శేష్ కంటెంట్ బేస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు.దీంతో వరుసగా హిట్స్ కొడుతూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు.
కెరియర్ ఆరంభంలో దర్శకుడుగా చేసి తప్పులో కాలేసిన అడవి శేష్ తరువాత ఆర్టిస్ట్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేసి కొంత వరకు ట్రాక్ లో పడ్డాక తనలో ఉన్న రచయితని బయటకి తీసుకొచ్చాడు. క్షణం సినిమాతో మొదటి హిట్ కొట్టాడు.
తరువాత గూఢచారి, ఎవరు సినిమాలతో హ్యాట్రిక్ విజయాల్ని హీరోగా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ మూడు సినిమాలకి కథ అందించింది అడవి శేష్ కావడం విశేషం.
ఇప్పుడు హీరోగా శేష్ ముంబై టెర్రర్ ఎటాక్స్ లో మరణించిన మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీతో మేజర్ అనే సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.దీంతో పాటు గూఢచారి సీక్వెల్ కూడా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే లాక్ డౌన్ తర్వాత మేజర్ షూటింగ్ మళ్ళీ రీసెంట్ గా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో మేజర్ కథ పుట్టుక వెనుక ఉన్న కారణాలని పంచుకున్నాడు.
ముంబై టెర్రర్ ఎటాక్స్ జరిగే సమయంలో తాను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాను.ఆ సమయంలో అక్కడి వార్తా చానెళ్లో మధ్యహ్నం ఆయన ఫొటో చూశాను.వెంటనే మా అన్నయ్యలా అనిపించాడు.అప్పుడు నాకు ఆయన కళ్లలో ఒక స్పిరిట్ కనిపించింది.
అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకి సంబంధించిన ప్రతి వార్తను కత్తిరించి పెట్టుకున్నాను.కంప్యూటర్ లో అయితే దాచిపెట్టుకున్నాను.
ఈ సినిమా చేయలన్నప్పుడు వెంటనే అతడి తల్లిదండ్రులను కలిశాను.మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ సహకారంతో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నామని చెప్పుకొచ్చాడు.