సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చింది.ఈ సమయం కోసమే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు.
మరి ఆ సమయం ఈ రోజుకి వచ్చింది.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ప్రస్తుతం ‘సర్కారు వారి పాట‘ సినిమా తెరకెక్కిన విషయం విదితమే.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఈ రోజు ఊర మాస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
కాసేపటి క్రితమే మేకర్స్ ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయడంతో సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మహేష్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అంత కన్నా డబల్ అందంగా, మాస్ హీరోలా చూపించి ప్రేక్షకులను ఖుషీ చేసాడు పరశురామ్.ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి కొద్దీ సేపు మాత్రమే అవుతున్న భారీ రెస్పాన్స్ అందుకుంటుంది.
ప్రేక్షకులు మాత్రమే కాదు ఈ ట్రైలర్ పై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.తాజాగా మహేష్ సర్కారు ట్రైలర్ పై అడవి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
ఈ ట్రైలర్ ను చుసిన ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసారు.సర్కారు వారి పాట ట్రైలర్ కు ఇది సరిపోదు అంటూ ఫైర్ ఎమోజీ పెట్టారు.
ఇంతకన్నా ఎక్కువ మే 12న చూడబోతున్నాం అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.మహేష్ మాత్రమే కాదు కీర్తి కూడా అందంగా కనిపించింది.ఇక థమన్ ఈసారి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు.
మేకర్స్ ముందు నుండి చెబుతున్న ప్రకారం ఇది మహేష్ మాస్ మెంటల్ స్వాగ్ లానే ఉంది.సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తుందో చూడాలి.







