ఆర్ఆర్ఆర్‌ను ఢీకొడుతున్న ఆదిపురుష్..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Adipurush Vs Rrr This Month, Adipurush, Rrr, Prabhas, Ntr, Ram Charan, Tollywood-TeluguStop.com

ఇక ఈ సినిమా నుండి ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను అక్టోబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

దసరా కానుకగా ఈ టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

అయితే ఇదే సమయంలో మరో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా చిత్రం నుండి కూడా ఓ కీలక అప్‌డేట్ రానుంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి ఆ రోజు ఓ అప్‌డేట్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ లెక్కన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తెరకెక్కుతున్న రెండు ప్రెస్టీజియస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాకుండా ఇలా టీజర్‌లతో కూడా పోటీ పడుతుండటంతో అప్పుడే పోటీ వాతావరణం నెలకొంది.

ఏదేమైనా ఇలా రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్టులు ఇలా రిలీజ్‌కు ముందే పోటీ పడుతుండటంతో ఏ సినిమాకు ఎక్కువ క్రేజ్ దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube