తిరిగి టీడీపీలో చేరనున్న కడప జిల్లా కీలక నేత!

టీడీపీలోకి త్వరలో భారీ చేరికలు ఉండే అవకాశం కనిపిస్తుంది.ఘర్ వాపస్ పేరుతో పార్టీని విడిచి వెళ్ళిన నేతలకు తిరిగి రావాలనే ఆహ్వానం పంపుతుంది టీడీపీ.

 Adinarayana Reddy Joins Tdp, Adinarayana Reddy, Bjp, Tdp, Minister, Party, Bhup-TeluguStop.com

  మాజీ మంత్రి, కడప జిల్లా నాయ‌కుడు ఆదినారాయ‌ణ‌రెడ్డి తిరిగి టీడీపీ చేరే ప్రయత్నాలు చేస్తున్నారు.ఎన్నిక‌లు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీకి ఏపీలో భవిష్యత్ లేదని భావించిన ఆయన తిరిగి టీడీపీలో చేరాలని భావిస్తున్నారు.

ఆదినారాయ‌ణరెడ్డి తాజాగా తన అనుచరులతో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.తిరిగి తెలుగుదేశంలో చేరాలనే అభిప్రాయాన్ని మోజార్టి నేతలు  వ్యక్తం చేసినట్లుగా సమాచారం.

2014లో జమ్మలమడుగు నుండి వైసీపీ తరుపున  గెలుపొందిన ఆయన ఆనరెషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలో చేరి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు.ఇక 2019లో కడ‌ప ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయ‌ణ‌రెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.తదనంతరం టీడీపీని వదిలి బీజేపీలో చేరారు.వైసీపీని విడిన తర్వాత జ‌గ‌న్‌పై ప‌లుసార్లు వ్యక్తిగ‌త విమ‌ర్శలు చేస్తు వచ్చారు.దీంతో వైసీపీ నేతలు ఆయన పై ఆగ్రహంగా ఉన్నారు.ఒక్కగానొక్క సమయంలో ఆయన వైసీపీ చేరేందుకు ప్రయత్నాలు చేశారని.

కానీ ఆ పార్టీ నేతలు ససేమిరా అనడంతో తిరిగి టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

టీడీపీలో చేరడానికి మరో కారణం ఆయన కుమారుడు భూపేష్ భవిష్యత్ కోసమని కూడా తెలుస్తుంది.ప్రస్తుతం ఆయన జ‌మ్మల‌మ‌డుగు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.వచ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌మ్మల‌మ‌డుగు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయ‌నున్నారు.

అలాగే ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌ కోసం కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు.అలాగే ఆయన చేరికపై టీడీపీ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది.

జిల్లా అధ్యక్ష ప‌ద‌వి లేదా పొలిట్‌బ్యూరో సభ్యుడుగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన‌ట్టుగా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube