టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో యమున( Actress Yamuna ) ఒకరు.తక్కువ సినిమాలలోనే నటించిన యమున సీరియళ్ల ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు.
అయితే ఒక వివాదంలో చిక్కుకోవడం యమునకు శాపంగా మారింది.ఆ వివాదం వల్ల యమున గురించి చాలామందిలో చెడు అభిప్రాయం ఉంది.
ఇప్పటికే యమున ఆ వివాదం గురించి ఒక ఇంటర్వ్యూలో స్పందించి క్లారిటీ ఇచ్చారు.
తాజాగా సుమ అడ్డా( Suma Adda ) ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో యమున చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో నా గురించి తప్పుగా రాసే కామెంట్ల వల్ల మా ఫ్యామిలీలో చాలామంది నన్ను దూరం పెట్టారని ఆమె తెలిపారు.వద్దు.చచ్చిపోదాం.సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు అంటూ యమున ఈ షోలో ఎమోషనల్ అయ్యారు.
ఒక సందర్భంలో యమున( Yamuna ) ఈ అంశం గురించి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా సోషల్ మీడియాలో థంబ్ నెయిల్స్ తో వీడియోలు చేస్తూ బాధ పడేలా చేస్తున్నారని ఆమె అన్నారు.నేను మనిషినే అని నేను చనిపోయినా వదిలేలా లేరని యమున కామెంట్లు చేశారు.నేను చనిపోయినా థంబ్ నెయిల్స్ పెట్టి డబ్బులు సంపాదిస్తారేమోనని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
యమున ఘాటు స్పందన నేపథ్యంలో ఇకనైనా పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది.యమున కెరీర్( Yamuna Career ) పరంగా మరింత బిజీ అయ్యి మరిన్ని అవకాశాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లు ఆమె ఆవేదనను కూడా అర్థం చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యమునకు కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలు దక్కాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.