చెన్నైలో పుట్టి పెరిగిన త్రిష ( Trisha ) మోడలింగ్ రంగం ద్వారా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.త్రిష మొదట్లో జోడి అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ పోషించి ఆ తర్వాత తమిళంలో మౌనంపేసియాదే అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

కానీ త్రిషకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం వర్షం( Varsham ).ఈ సినిమాతో హీరోయిన్ త్రిష రేంజ్ మారిపోయింది.ఆ తర్వాత తమిళంలో గిల్లి సినిమా కూడా కోలీవుడ్లో ఈమె రేంజ్ మార్చేసింది.అయితే అలాంటి ఈ హీరోయిన్ నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు.
కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట.మరి త్రిష పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు? అసలు విషయాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిష ఆ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉండి మళ్ళీ పొన్నియన్ సెల్వన్ ( Ponniyan Selvan ) సినిమా ద్వారా కం బ్యాక్ ఇచ్చి వరుస సినిమాల్లో చేస్తోంది.ఇప్పటికే విజయ్ హీరోగా వస్తున్న లియో తో పాటు మూడు తమిళ సినిమాల్లో అలాగే రెండు మలయాళ సినిమాల్లో ఈమె హీరోయిన్ గా చేస్తుంది.
ఇక ఈమె పెళ్లి విషయానికి వస్తే గతంలో ఎంతోమంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసినప్పటికీ బిజినెస్ మాన్ అయినా వరుణ్ మానియన్ ( Varun Maniyan ) తో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంది.

కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల వీరి మధ్య ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది.అయితే ఆ తర్వాత ఎలాంటి ఎఫైర్ వార్తలు కూడా ఈ హీరోయిన్ పై వినిపించలేదు.కానీ తాజాగా మలయాళ ఇండస్ట్రీ( Malayalam Industry ) నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం మలయాళంలో స్టార్ నిర్మాతగా కొనసాగుతున్న ఆ వ్యక్తితో త్రిష ప్రేమలో పడిందట.
ఇక త్వరలోనే ఆ ప్రొడ్యూసర్ తో ఉన్న ప్రేమ విషయాన్ని బయట పెట్టి ఆ మలయాళ నిర్మాతని త్రిష పెళ్లి ( Trisha Marraige ) చేసుకోబోతుందని మాలయాళ ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లో త్రిష ఆ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందని సమాచారం.
ఇక త్రిష పెళ్లి వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది ముందు ముందు తెలుస్తుంది.