స్టార్ హీరోయిన్ సమంత సక్సెస్ సీక్రెట్ ఇదేనంట..?

11 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సమంత సొంతం చేసుకున్నారు.

అటు గ్లామరస్ రోల్స్ లోనూ ఇటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నటించి మెప్పించిన సమంత సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా మాత్రం నటించలేదు.

సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు టాక్ షోలను, రియాలిటీ షోలను హోస్ట్ చేసిన సమంత హోస్ట్ గా కూడా మంచి పేరును సొంతం చేసుకున్నారు.సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న సమంత ఒక సందర్భాల్లో తాను కెరీర్ లో సక్సెస్ కావడం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సమంత హార్డ్ వర్క్ వల్లే సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నానని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతానని ఆమె అన్నారు.

ప్రతిరోజును తన ఫస్ట్ డేలా భావించి వర్క్ విషయంలో శ్రమిస్తానని.కష్టంతో పని చేస్తే సక్సెస్ తప్పకుండా సొంతమవుతుందని ఆమె తెలిపారు.

Advertisement

బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సమంత హార్డ్ వర్క్ ను నమ్ముకుని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు.ఇప్పటివరకు సినిమాల్లో పాజిటివ్ రోల్స్ లో ఎక్కువగా నటించిన సమంత ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ లో కనిపించనుండటం గమనార్హం.

ఫిబ్రవరి 12వ తేదీన ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ వెబ్ సిరీస్ సమ్మర్ లో విడుదల కానుంది.సమంత నటిస్తున్న శాకుంతలం సినిమా కూడా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది.శాకుంతలంలో సమంత తొలిసారి పౌరాణిక పాత్రలో నటిస్తూ ఉండటంతో ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు