ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవి మధ్య టికెట్ రేట్ల సమస్య గురించి చర్చ జరిగిన సంగతి తెలిసిందే.భేటీ అనంతరం చిరంజీవి మరో పది రోజుల్లో టికెట్ రేట్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని కామెంట్లు చేశారు.
అయితే చిరంజీవి జగన్ మధ్య భేటీ గురించి కొంతమంది రాజకీయ, సినీ ప్రముఖులు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.సీఎం జగన్ చిరంజీవికి రాజకీయంగా ప్రయోజనం చేకూరేలా ఆఫర్లు ఇచ్చారని కామెంట్లు వినిపించాయి.
అయితే శ్రీరెడ్డి తాజాగా చిరంజీవి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.శ్రీరెడ్డి వీడియోలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పడంతో పాటు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
వ్యక్తిగతంగా చిరంజీవి నాకు నచ్చడని చిరంజీవి నాకు నచ్చకపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చని శ్రీరెడ్డి వెల్లడించారు.ఆ విషయాలలో కొన్ని షేర్ చేసుకోగలనని మరికొన్ని షేర్ చేసుకోలేనని శ్రీరెడ్డి చెప్పారు.
మీటూ ఉద్యమం చేసిన సమయంలో చిరంజీవి ఆ ఉద్యమాన్ని తొక్కేయడానికి ట్రై చేశారని శ్రీరెడ్డి అన్నారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తెరవెనుక ఉండి పెద్దవాళ్ల పేర్లు బయటకు రాకుండా కాపాడే ప్రయత్నం చిరంజీవి చేశారని శ్రీరెడ్డి తెలిపారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తనకు సభ్యత్వం రాకుండా చిరంజీవి చేశారని శ్రీరెడ్డి వెల్లడించారు.మీడియా ముందు చిరంజీవి యాక్టింగ్ చేస్తారని శ్రీరెడ్డి అన్నారు.
చిరంజీవి అవకాశవాది అని శ్రీరెడ్డి అన్నారు.చిరంజీవి వెళ్లడం వల్ల కొంతమంది మాత్రం సైలెంట్ అయ్యారని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు.ఈ విషయంలో మాత్రం తాను హ్యాపీ అని శ్రీరెడ్డి అన్నారు.ఆర్జీవీపై కూడా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం గమనార్హం.శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.