టాలెంటెడ్ బ్యూటీ చేతిలో 7 తెలుగు మూవీలు.. అమ్మడికి ఇక అడ్డే లేదా?

ఎంత టాలెంట్ ఉన్న కూడా అప్పుడప్పుడు లక్ లేకపోతే వారి కెరీర్ అంతా స్పీడ్ గా సాఫీగా సాగదు.ఇందుకే ఈ రంగుల ప్రపంచంలో కెరీర్ కొనసాగించాలంటే అందం, అభినయం ఉంటే చాలదు.

 Actress Sree Leela 7 Films In Tollywood , Sree Leela, Pelli Sandadi Movie, Nithi-TeluguStop.com

ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి.మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యూటీకి అయితే అందం, అభినయం తో పాటు అదృష్టం కూడా ఉంది.

అది ఆవగింజ అంత కాదు.ఎక్కువే అని చెప్పాలి.

ఎందుకంటే ఈమె సినిమాల లిస్ట్ చుస్తే అందరికి అదే అనిపిస్తుంది.

ఈమె చేసింది తెలుగులో ఇప్పటికే ఒకే ఒక్క సినిమా.

అయినా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు.కానీ ఈమె మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది.

ఇంతకీ ఆమె ఎవరో తెలిసే ఉంటుంది. ఆమే శ్రీలీల.

శ్రీలీల రాఘవేంద్రరావు పర్వేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా వెండి తెరమీద అడుగు పెట్టింది.ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు.

ఈ సినిమా తర్వాత శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకు పోతుంది.ఈమె ఆఫర్స్ వచ్చే కొద్దీ రేటు కూడా భారీగా పెంచుకుంటూ పోతుంది.

ఇప్పుడు ఏ హీరోయిన్ చేతిలో లేనన్ని సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయంటూ చెబుతున్నారు. శ్రీలీల ఏకంగా 7 సినిమాలను లైన్లో పెట్టుకున్నట్టు టాక్.

ప్రెసెంట్ ఈమె రవితేజ ధమాకా సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాతో పాటు ఈమె బాలయ్య, మహేష్, శర్వానంద్, నితిన్ వంటి హీరోలతో నటిస్తుంది.అటు సీనియర్ హీరోల సినిమాల్లో చేస్తూనే.ఇటు యంగ్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.

ఇప్పటికే ధమాకా సినిమా షూట్ ముగియగా ఈ సినిమా దీపావళికి రిలీజ్ కాబోతుంది.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube