బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన గీతూ రాయల్( Geetu Royal ) ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వీడియోలు చేస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యారు.అయితే గీతూ రాయల్ కు తాజాగా భారీ షాక్ తగిలింది.
కొన్నిరోజుల క్రితం సౌమ్యా శెట్టి( Soumya Shetty ) అనే నటి 74 తులాల బంగారం చోరీ చేసిందంటూ ఒక కేసు నమోదు కాగా పోలీసులు ఆమె నుంచి 40 తులాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.బెయిల్ మీద బయటకు వచ్చిన సౌమ్య సోషల్ మీడియా వేదికగా ఏం జరిగిందో వెల్లడించారు.
తనపై తప్పుడు కేసు పెట్టారని లేనిపోని నిందలు వేశారని రిమాండ్ లో లేకపోయినా రిమాండ్ లో ఉందని జైలులో ఉందని నాపై అసత్య ప్రచారం చేశారని ఆమె కామెంట్లు చేశారు.
బయటికొచ్చి నిజాలు చెబుతుంటే ఏవేవో కేసులు పెట్టి నా నోరు నొక్కేస్తున్నారని ఆత్మహత్య చేసుకొని చనిపోదామనుకున్నానని కానీ నా భర్త పోరాడాలని చెప్పారని ఫైట్ చేస్తానని ఆమె పేర్కొన్నారు.మీరు అబద్ధాన్ని నిజం చేశారు కానీ నన్ను భయపెట్టలేరని సౌమ్య తెలిపారు.నాకు దొంగ( Thief ) అని ట్యాగ్ వేసి జైలులో వేద్దామనుకున్నారని నాకూ ఒక కుటుంబం ఉందని నేను నా నిజం చెప్పుకోవాలని ఆమె తెలిపారు.
కోర్టులో ఏదీ ప్రూవ్ కాకముందే నా జీవితాన్ని నాశనం చేశారని నా వైపు దేవుడు ఉన్నాడని పోరాడతానని ఆమె పేర్కొన్నారు.నాపై దుష్ప్రచారం చేసిన గీతూరాయల్, యాంకర్ ధనుష్( Anchor Dhanush ) లపై కేసులు వేయబోతున్నానని సౌమ్య వెల్లడించారు.
సౌమ్యాశెట్టి కామెంట్ల విషయంలో గీతూ రాయల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.సౌమ్యాశెట్టి ఎంతో బాధ పడిందని అందువల్లే ఆమె ఈ తరహా కామెంట్లు చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సౌమ్యాశెట్టిపై నమోదైన కేసులు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది.