కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు.ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అయితే కొన్నిసార్లు ఈమె చేసే పోస్టుల కారణంగా భారీ ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతూ ఉండే రష్మిక ఎప్పటికప్పుడు తనని ట్రోల్ చేసిన వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ ఉంటారు.ఈ క్రమంలోనే మరోసారి మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా మీడియా వారు తనని ప్రశ్నిస్తూ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడానికి ఎక్కువ పోరాటం చేశారా.లేక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నిలదొక్కు కోవడానికి పోరాటం చేశారా అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ పలు విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా రష్మిక స్పందిస్తూ జీవితంలో ఎప్పుడు పోరాటాలు చేస్తూనే ఉండాలి అసలు జీవితం అంటేనే పోరాటం.అయితే అది ఒక్కో దశలో ఒక్కో విధంగా ఉంటుంది.నేను హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనుకున్న సమయంలో నటిగా నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలను అనే నమ్మకం నా కుటుంబ సభ్యులకు కల్పించాలి.
నా విషయానికి వస్తే కెరియర్ మొదట్లో అదొక పెద్ద యుద్ధమే అని ఈమె తెలియజేశారు.ఇలా కొన్ని సినిమాలు చేసి నటిగా నేనేంటో నిరూపించుకున్న తర్వాత కూడా మరొక రకమైన యుద్ధం చేయాల్సి వస్తుందని తెలిపారు.
ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి, సమయంతో ఎలా పోటీ పడాలి, కుటుంబానికి టైమ్ ఎలా కేటాయించాలి.ఇలా అనేక విషయాల్లో మనం మనతోనే మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.