ఇప్పుడంటే ప్రేక్షకులు బాగా తెలివి మీరు పోయారు కళ్ళ ముందు జరుగుతున్నది ఏది నిజం కాదు అని నమ్ముతున్నారు కానీ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏది జరిగిన అదే నిజం అనే ప్రేక్షకులు నమ్మేవారు అంత న్యాచురల్ గా తీసి ప్రేక్షకుల చేత మార్కులు వేయించుకునేవారు దర్శక నిర్మాతలు అందుకే చాలా వరకు సీన్స్ సహజంగా వచ్చేవి దానికోసం చాలా కష్టపడేవారు ఆ ఫీల్డ్ కోసం దర్శకుల పాటలు మామూలుగా ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి సినిమా సన్నివేశానికి కష్టపడాల్సిన అవసరం లేదు.కానీ సహజంగా రావాలి అని ఎంతో కష్టపడి తీసిన కొన్ని సన్నివేశాల్లో( Scenes ) బయట ప్రపంచానికి తెలియదు కానీ కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి.
అందుకే చాలామంది స్టార్స్ కాళ్లు చేతులు విరగొట్టుకుంటారు.అలాగే కొంతమంది మరణం అంచుల వరకు కూడా వెళ్లి వస్తారు.అలాంటి ఒక సంఘటన నటి రాజ్యలక్ష్మి( Actress Rajyalakshmi ) విషయంలో కూడా జరిగింది.సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో 100కు పైగా చిత్రాలు నటించారు రాజలక్ష్మి.
అయితే ఆమె ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో చెవిలో పువ్వు( Chevilo Puvvu ) అనే సినిమాలో నటిస్తున్న క్రమంలో ఆమె చనిపోయినంత పని జరిగిందట.గుడి దగ్గర ఉన్న ఒక మండపంలో ఆమె ఉరి వేసుకుని చనిపోయే సన్నివేశాన్ని చిత్రీకరించాలనుకున్నాడట దర్శకుడు.
అయితే అది నాచురల్ గా( Natural ) రావడం కోసం నిజంగానే ఆమె తాడు కట్టి లాంగ్ షార్ట్ లో షూట్ చేస్తున్నారట.అయితే ఆమెకు ఉడికాక ఉరి బిగిసుకుంటే సహాయం చేయడానికి స్తంభాల వెనక ఎవరికి కనిపించకుండా వ్యక్తులను పెట్టారు.కానీ ఆమెకు ఉరిపడ్డ( Hang ) విషయాన్ని మాత్రం గమనించడం మర్చిపోయారు.కెమెరా తీస్తున్న వ్యక్తులు ఉండడం వల్ల ఆ విషయాన్ని గమనించిన ఎంత అరిచిన వారికి వినిపించలేదట.
చివరికి ఆమె కళ్ళు తేలేస్తున్న విషయాన్ని గమనించే సరికి అప్పటికే దాదాపు చావు అంచుల వరకు వెళ్ళింది.అప్పుడు కాస్త కుదుట పడి లేపితే కోలుకొని తిరిగి మళ్ళీ షార్ట్ పూర్తి చేసిందట.