ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి.. పరవాలేదా .. పూనమ్ కామెంట్స్ వైరల్!

సినీనటి పూనమ్ కౌర్( Poonam Kaur ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె సినిమాలలో పెద్దగా నటించకపోయిన పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తూ ఉంటారు.

 Actress Poonam Kaur Once Again Traget On Pawan Kalyan ,pawan Kalyan,poonam Kaur,-TeluguStop.com

ఈమె సినిమాల కంటే వివాదాలలోనే బాగా పాపులారిటీ పొందారని చెప్పాలి.తరుచూ సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు.

ముఖ్యంగా ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా పోస్టులు చేస్తూ ఉంటారు.

Telugu Elon Musk, Pawan Kalyan, Pawankalyan, Poonam Kaur, Poonamkaur, Tesla Cars

ఇక ఏపీలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈమె వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తూ పరోక్షంగానే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా ఈమె చేస్తున్నటువంటి పోస్ట్ సంచలనంగా మారింది.సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ చేసినటువంటి పోస్ట్ కు ఈమె స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Elon Musk, Pawan Kalyan, Pawankalyan, Poonam Kaur, Poonamkaur, Tesla Cars

వైసీపీ ప్రభుత్వ సానుభూతి పరుడైన ఓ నెటిజన్… ఆంధ్రప్రదేశ్ లో టెస్లా కార్ల కంపెనీ ఏర్పాటు చేయాలని ఎలన్ మస్క్ ని( Elon Musk ) రిక్వెస్ట్ చేశాడు.అయితే ఆయన లండన్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారని తెలుస్తుంది.అయితే ఆయన చేసినటువంటి ట్వీట్ ను కోట్ చేసిన పూనమ్ కౌర్.అతనికి మూడు పెళ్లిళ్లు, పర్లేదుగా? అని కామెంట్ పెట్టింది.వైసీపీ నేతలు తరచుగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేస్తూ ఉంటారు.స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి కూడా పలు సందర్భాలలో పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావనకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఎలన్ మస్క్ కి మూడు పెళ్లిళ్లు కావడంతో ఆయనకు మూడు పెళ్లిళ్లు అయినా పరవాలేదా అంటూ పరోక్షంగా పవన్ ని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube