ప్రస్తుతం కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.దీంతో ఇప్పటికే అత్యవసర లాక్ డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా రోజువారి కూలీలు, నిరుపేదలు, పూటగడవని వారు తదితరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
దీంతో వీరికి సహాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు మరియు సంపన్నులు తమకు తోచినంత మొత్తాన్ని విరాళంరూపంలో సహాయంగా అందించారు.అయితే తాజాగా గ్రామాల్లో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు సహాయం చేసేందుకు టాలీవుడ్ బొద్దుగుమ్మ నిత్యమీనన్ ముందుకొచ్చింది.
ఇందులో భాగంగా తాను ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో ధరించిన దుస్తులను ఆన్ లైన్ ద్వారా వేలం వేసి వచ్చిన మొత్తాన్ని పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఉపయోగించనున్నట్లు నిత్యామీనన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది.అయితే ఈ వేలం ఈ నెల 17వ తారీఖున నిర్వహించనున్నట్లు కూడా తెలిపింది.
అయితే నిత్యామీనన్ చేసినటువంటి పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే పేద ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినటువంటి నిత్యామీనన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నిత్యామీనన్ నటించినటువంటి మిషన్ మంగళ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.అయితే ప్రస్తుతం నిత్యామీనన్ “కోలాంబి” అనే మలయాళ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయినట్లు సమాచారం.