టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్.
కాజల్ తన చిన్న నాటి స్నేహితుడు అయిన గౌతమ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది కాజల్ అగర్వాల్.
అయితే ప్రస్తుతం తన బిడ్డ ఆలన పాలన చూసుకుంటూ ఫ్యామిలీ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరువగా ఉంటోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా కాదని అగర్వాల్ అమ్మతనం గురించి, తన మనసులో ఉన్న భావాలను ఒక కార్యక్రమంలో భాగంగా వెల్లడించింది.
కాగా బాలీవుడ్ నటి నేహా ధూపియా నిర్వహిస్తోన్న కార్యక్రమం ఫ్రీడమ్ టు ఫీడ్.తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తన అమ్మతనం అనుభూతులను, తన తియ్యని బాధను అభిమానులతో పంచుకుంది.
ఈ సందర్బంగా కాజల్ మాట్లాడుతూ.కొడుకు నీల్ పుట్టాకే నాకు జీవితం అంటే ఏంటో అర్థం అయ్యింది.
కొన్ని సార్లు వాణ్ణి ఇంట్లోనే విడిచి వెళ్లాల్సి వచ్చేది.అప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించేది కానీ ఏం చేయను.

కానీ ప్రసవం అయినా తరువాత దాదాపుగా 40 రోజులు ఇంట్లోనే ఉన్నాను. నేను ఆ 40 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళలేదు.కానీ కొన్ని సందర్భాలలో నా బాబును మా అమ్మ ఒక రూంలో చూసుకుంటే.నేను మరో రూంలో షూటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది కాజల్.
అప్పుడు నా బాబు కోసం నేను తగినంత సమయాన్ని కేటాయించ లేక పోతున్నాను అన్న భావన నన్ను వేధిస్తూ ఉండేది.ఇక నా పిల్లాడికి రొమ్ము పాలు పడుతుంటే ఎంతో సంతోషాన్ని నేను పొందుతాను.
నాలాగే ప్రతీ తల్లి కూడా ఇదే ఆనందాన్ని పొందుతుంది అని నాకు తెలుసు అని చెప్పు కొచ్చింది కాజల్.ఒక తల్లీగా పాలు పట్టే సమయంలో ఆ నొప్పిని కూడా తల్లి భరిస్తుంది.
అలాంటి నొప్పిని నేను కూడా భరించాను.ప్రస్తుతం కొంత మంది నిపుణుల సూచనలతో నా వెంట ఓ బ్రెస్ట్ పంప్ ను తీసుకెళ్లి సమయానికి నా బిడ్డకు పాలు అందిస్తున్నాను అని తెలిపింది కాజల్.







