తిరుమల శ్రీవారిని సినీ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.
ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ వెలుపల కాజల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తన భర్తతో కలిసి మొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు.ఇండియన్-2 షూటింగ్ కోసం తిరుపతిలో ఉన్నానని, సినిమా షూటింగ్ బాగా జరుగుతుందని ఆమె తెలియజేశారు.