మామూలుగా యాచకులు( Beggars ) ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రోడ్డు ఇరువైపులా లేదంటే గుడిమెట్ల వద్ద, రైల్వే స్టేషన్లో, బస్టాండ్ లో ఇలా ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంటారు.ధర్మం చేయండమ్మా, బాబూ, దానం చేయండయ్యా అంటూ యాచిస్తూ ఉంటారు.
అయితే కొందరు డబ్బులు లేదని వెళ్ళిపోతూ ఉంటారు.కానీ కొందరు మాత్రం చిల్లర లేదని చెప్పినా సరే వినిపించుకోకుండా డబ్బులివ్వమని పట్టుపడతారు.
ఇచ్చేవరకు వదిలిపెట్టరు.అయితే బిగ్‌బాస్ బ్యూటీ, నటి హీనా ఖాన్( Actress Hina Khan )కు దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైందట.

అంతేకాకుండా ఒక యాచకుడు చేసిన పనికి ఆమె షాక్ అయిందట.ఈ సందర్భంగా హీనా ఖాన్ తనకి ఎదురైన అనుభవం గురించి చెబుతూ.నేను కారులో వెళ్తున్నప్పుడు ఒక జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది.గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక వ్యక్తి నా కారు విండో తట్టాడు.
డబ్బులివ్వమని అడిగాడు.అయ్యో, నా దగ్గర క్యాష్ లేదని బదులిచ్చాను.
అతడు వెంటనే ఈరోజు ఉదయం నుంచి బోణీ కాలేదు ఇంట్లో తమ్ముడు, చెల్లె ఉన్నారు అంటూ అభ్యర్థించాడు.నిజంగానే నా దగ్గర డబ్బుల్లేవు.
అంటూ సారీ కూడా చెప్పాను.అతడు వెంటనే గూగుల్ పే( Google Pay ) చేయండంటూ తన నెంబర్ ఇచ్చాడు.
నేను ఒక్కసారిగా షాకయ్యాను.

ఒక వారం రేషన్‌కు సరిపడా డబ్బులు పంపమని చెప్పాడు.వెంటనే అతడికి అవసరమయ్యేంత డబ్బు యూపీఐ ద్వారా పంపించాను.కానీ నిజంగానే సర్ప్రైజ్ కదా. డిజిటల్ ఇండియా ( Digital India )అంటే ఇదేనేమో అని చెప్పుకొచ్చింది హీనా ఖాన్.ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు కామెడీగా స్పందిస్తుండగా మరికొందరు యూపీఐ ట్రాన్సక్షన్స్( UPI Transactions ) మెయింటైన్ చేసేవాడు బిచ్చగాడు అంటే మీరు ఎలా నమ్మారు మేడం అంటూ కామెంట్ చేస్తున్నారు.