తెలుగులో తకిట తకిట అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి హరిప్రియ తెలుగులో పలు సినిమాలలో నటించి సందడి చేశారు.నాని సరసన పిల్ల జమిందార్, జై సింహా అమ్మాయి క్లాస్ అబ్బాయి మాస్ అనే సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి సందడి చేశారు.
ఇకపోతే ఈమె కేజిఎఫ్ నటుడు వశిష్ట సింహంను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు.ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది.
ఇకపోతే వీరిద్దరూ ఓ సినిమాలో కలసి నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనీ అందరూ భావించారు.ఇన్ని రోజులు పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్న అనంతరం తన ప్రేమ ఎలా చిగురించిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియ చేశారు.
తమ ఇద్దరి ప్రేమ చిగురించడానికి కారణం తన కుక్క పిల్ల అని ఈమె అసలు విషయం తెలిపారు.తన వద్ద లక్కీ, హ్యాపీ అని రెండు కుక్కపిల్లలు ఉన్నాయని అయితే అందులో లక్కీ చనిపోవడంతో హ్యాపీ ఒంటరిగా ఉంది.
ఇలా హ్యాపీ ఒంటరిగా ఉండడంతో వశిష్ట తనకు క్రిస్టల్ అనే ఓ కుక్కపిల్లను ఇచ్చాడని, అయితే ఆ కుక్క పిల్ల చర్మంపై హార్ట్ సింబల్ కూడా ఉందని అలా క్రిస్టల్ పెరుగుతూ ఉండడంతో మా ఇద్దరి మధ్య కూడా ప్రేమ పెరిగిపోయింది అంటూ ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం క్రిస్టల్ అనే కుక్కపిల్ల అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పుకోచ్చారు.