సెట్ లో దొంగతనం చెయ్యాలనుకున్న హన్సిక.. కానీ ఆమె ఒక అతనిపై మనసు పారేసుకుందట!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటి, గ్లామర్ బ్యూటీ హన్సిక. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది హన్సిక.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సెట్ లో దొంగతనం చేయాలని అనుకుందట.

 Hansika Wants To Steal From The Set But She Has A Crush On Him Details, Hansika-TeluguStop.com

ఇంతకు అదేం దొంగతనమో తెలుసుకుందాం.

హన్సిక సినీ ఇండస్ట్రీకి 2001లో చిన్న వయసులోనే అడుగు పెట్టింది.

అలా బాలనటిగా పలు సినిమాలలో నటించింది.ఆ తర్వాత బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది.

ఇక ఈమె 2007లో హీరోయిన్ గా తన పరిచయాన్ని పెంచుకుంది.అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.

చాలా వరకు స్టార్ హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్ ల సరసన నటించింది.బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈమె సెట్ లో బాగా అల్లరి పనులు చేస్తూ ఉంటుంది.

Telugu Actress Hansika, Crush, Hansika, Kalyan Ram, Jayee Bhava, Theft, Tollywoo

కాస్త బ్రేక్ దొరికితే చాలు తను బాగా సందడి చేస్తుంది అని తనతో నటించిన నటులు చెబుతుంటారు.ఇదిలా ఉంటే హన్సిక తాను దొంగతనం చేయాలనుకున్న విషయాన్ని అందరి ముందు బయటకు చెప్పేసింది.ఇంతకీ అదేం దొంగతనమో ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో తాను కళ్యాణ్ రామ్ సరసన ‘జయీభవ’ అనే సినిమాలో నటిస్తున్న సమయంలో తనకున్న ఓ అలవాటు గురించి బయట పెట్టింది.

Telugu Actress Hansika, Crush, Hansika, Kalyan Ram, Jayee Bhava, Theft, Tollywoo

ఏదైనా డబ్బులు పెట్టి కొనుక్కొని తింటే రుచిగా ఉండదని దొంగలించి తింటే ఆ రుచే వేరుగా ఉంటుందని తెలిపింది.అంటే అదేదో పెద్ద విషయంలో కాదని.తను చిన్నప్పుడు పక్క పిన్ను లు, తినుబండారాలు, వక్కపొడి దొంగలించేదట.

ఇక పెద్దయ్యాక స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు వారు తింటున్న ఫుడ్డు ను వారికి తెలియకుండా తీసుకోవడం కోసం వారిని మాటల్లో దింపి సైలెంట్ గా తీసుకొని తినేదట.

Telugu Actress Hansika, Crush, Hansika, Kalyan Ram, Jayee Bhava, Theft, Tollywoo

అలా దొంగలించి తింటే చాలా రుచిగా ఉంటాయని తెలిపింది హన్సిక.ఇక తాను నటిస్తున్న జయీభవ సినిమా షూటింగ్ లో ఏదైనా దొంగలించాలి అనుకుందట.కానీ కుదరలేదని తెలిపింది.

కాని తన నుంచి ఒకటి దొంగలించబడిందని.అదేంటంటే తన మనసును కళ్యాణ్ రామ్ దొంగిలించాడని తెలిపింది.

ఇక ఈ విషయం హన్సిక ఎప్పుడో చెప్పగా ప్రస్తుతం నెట్టింట్లో మరోసారి వైరల్ గా మారింది.ఇక హన్సిక రీ ఎంట్రీతో వరుసగా అవకాశాలు అందుకుంటుంది.

ఇక ఈ ఏడాది 105 మినిట్స్ అనే సినిమాలో నటిస్తున్నానని గతంలో ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube