పవన్ కళ్యాణే ప్యాకేజ్ స్టార్.. తొక్కలోది ఇప్పుడు ఎవరో ఇచ్చేది ఏంటో!

హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు ఎంతమంది ఉన్నారు విమర్శించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు.అరె నీ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళు ఎక్కువగా ప్యాకేజీ స్టార్ అని, మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఉంటారు.

 Actress Divya Vani Reacts To Pawan Kalyan Package Star Rumours Details, Divya Va-TeluguStop.com

ఇక ఈ మధ్య కాలంలో అయితే పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుకి దత్తపుత్రుడు అంటూ కూడా ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టారు.చంద్రబాబుకు పై అధికార పార్టీలు విమర్శలు చేసిన ప్రతిసారి ఆ అధికార పార్టీలపై విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అండగా నిలబడడంతో చంద్రబాబు చెప్పినట్లు చేయడానికే జనసేన పార్టీని స్థాపించారని ఆ పార్టీకి, నాయకుడు పవన్ కి ఎటువంటి సొంత కార్యాచరణ లేదు అన్న విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు జనసేన సైనికులు.

తాజాగా టీడీపి మాజీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.పవన్ కళ్యాణ్ పై వస్తున్న ప్యాకేజీ స్టార్ అన్న విమర్శల్ని తిప్పికొట్టారు ఆయన పై ప్రశంసల వర్షం కురిపించింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దివ్యవాణి మాట్లాడుతూ.ఐ లవ్ పవన్ కళ్యాణ్.ఐ లైక్ పవన్ కళ్యాణ్.ఆయన భావజాలం నాకు బాగా నచ్చుతుంది.చాలామంది ఆయనను ప్యాకేజీ స్టార్ అని అనుకుంటున్నారు.అలా అన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది.

తొక్కలో ప్యాకేజీ స్టార్ ఎవడో ఆయనకు ఇచ్చేది ఏమిటి.

Telugu Chandrababu, Divya Vani, Janasena, Pawan Kalyan, Pawan Package, Rumours-M

పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఒక ప్యాకేజీ. అలాంటి ఆయనకు ప్యాకేజీ ఇచ్చే అంత సీను ఎవరికి ఉంది అంటూ పవన్ ని విమర్శించే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దివ్యవాణి.పవన్ కళ్యాణ్ కంట్రోల్ కలిగిన వ్యక్తి తనని తాను కంట్రోల్ చేసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది చాలా పద్ధతిగా కూడా మాట్లాడతారు.

ఆయనకు ఓపిక ఉన్నంతవరకు జనంలోకి వెళ్తున్నారు సమస్యలపై స్పందిస్తున్నారు అని చెప్పుకొచ్చింది దివ్యవాణి.ఒక లీడర్ గా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.ఎవరిని అనవసరంగా ఒక మాట అనరు సున్నిత స్వభావం గల వ్యక్తి.సమస్య వచ్చింది అంటే చాలు జనంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని తెలిపింది దివ్యవాణి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube