బిగ్ బాస్ నుంచి వచ్చిన నటి దివి( Actress Divi ) తాజాగా లంబసింగి( Lambasingi Movie ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది చాలా రోజులుగా ఆమెను కేవలం గ్లామర్ యాంగిల్ లో మాత్రమే చూసిన దర్శకులు ఇప్పుడు నటనకు స్కోప్ ఉన్న ఒక పాత్రలో దివిని తీసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు నవీన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో భరత్ రాజ్( Bharat Raj ) అనే ఒక కొత్త నటుడు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు.ఒక నక్సలైట్ కడుపున పుట్టిన అమ్మాయిగా దివి నటించగా కానిస్టేబుల్ పాత్రలో హీరో నటించాడు.
అసలు ఎప్పుడు దివి నటన ఇలా ఉంటుందో ఎవరూ చూసి ఉండరు అద్భుతంగా తన పాటలు ఒదిగిపోయింది.ఇలాంటి మరిన్ని సినిమాలు దివి కెరియర్ లో పడితే ఆమె మంచి హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమాకి ఆనంద్ తన్నీరు నిర్మాణ బాధ్యతలు చేపట్టగా తాజాగా థియేటర్ల లో లంబసింగి విడుదల అయింది.మొదటి షో నుంచి మంచి టాక్ తో బజ్ క్రియేట్ చేస్తోంది.అయితే సినిమాలో అనేక అంశాలు ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.మొదటి భాగం కాస్త స్లో అనిపించిన క్లైమాక్స్ మాత్రం చాలా డీసెంట్ గా పూర్తవుతుంది.
ఇక రెండవ భాగం పూర్తిగా ఎమోషన్స్ తో నిండుకొని ఉంది.సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఆ ఎమోషన్స్ నీ క్యారీ చేస్తాడు.ఇక నవీన్ గాంధీ( Naveen Gandhi ) ఇంతకు ముందు గాలిపటం అనే ఒక సినిమా తీయగా అందులో హీరో గా సాయి కుమార్ కొడుకు ఆది నటించాడు.లంబసింగి అతనికి రెండవ చిత్రం.
లంబసింగి సినిమాను చూసిన వారంతా కూడా ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లిన ఫీలింగ్ ఉందని చెబుతున్నారు.దివిలో ఒక సహజనటి కనిపించగా ఆమె పాత్ర పూర్తిగా ఈ చిత్రానికి ఒక పాజిటివ్ అంశం అలాగే భరత్ కూడా తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.ఇక ఈ సినిమాలో రారండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు సోగ్గాడే చిన్ని నాయన సక్సెస్ఫుల్ సినిమాలను తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ సమర్పించడం విశేషం.రెండు గంటల రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ను ఆద్యాంతం ఆసక్తికరంగా తిలకించవచ్చు.