సినిమాలు లేక ప్రైవేట్ స్కూల్ టీచర్ గా దేవయాణి..ఆమెని చూస్తే గుండె తరుక్కుపోతుంది

దేవయాణి ఈ పేరు ఎక్కువమందికి తెలియకపోయినా పవన్ కళ్యాణ్ కెరియర్ లో సూపర్ హిట్ సినీమా అయిన సుస్వాగతం సినిమాలోని హీరోయిన్ అంటే అందరికి ఇట్టే గుర్తొచ్చేస్తుంది.

ఆ సినిమాలో ఎంతో సింపుల్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమున్నా లేనట్టుగా అస్సలు సినిమా అంతా తండ్రికి భయపడే ఒక మధ్యతరగతి అమ్మాయిగా.

ఈమె నటన అద్భుతమనే చెప్పాలి.ఇక ఆ సినిమా తర్వాత ఈమె మన తెలుగులో ఎక్కువగా కనిపించలేదు.1993 లో బెంగాలీ సినిమాతో మొదలైన ఈమె సినిమా ప్రయాణం ఆతర్వాత తమిళ్ లో బాగా బిజీ అయిపోయారు.ఇక అప్పుడప్పుడు మలయాళం, తెలుగు, బెంగాలీ భాషల్లో అడపా దడపా సినిమాల్లో నటిస్తూ తమిళ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటించింది.

ఈమె అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు 90 సినిమాల్లో నటించారు.అలాగే 7 సీరియల్స్ లో కూడా నటించారు.ఇక మన తెలుగులో దేవయాణి కొన్ని సినిమాల్లోనే నటించినా అందరికి గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది.

సుస్వాగతం లో అమాయకురాలైన అమ్మాయిలా, నాని సినిమాలో మహేష్ బాబుకి అమ్మలా, చెన్నకేశవరెడ్డి లో పవర్ఫుల్ అన్నయ్యకు చెల్లెలిలా, జనతాగ్యారేజ్ అండ్ అరవింద సమేత సినిమాల్లో ఎన్టీఆర్ కి అమ్మలా నటించి అందరిని మెప్పించింది.అయితే దేవయాణి గారికి అందరి హీరోయిన్స్ లా కాకుండా ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ముంబై లో పుట్టిన దేవయాణి అస్సలు పేరు సుష్మ.

Advertisement
Actress Devayani Turns Privet School Teacher, Devayani Daughters, Iniya And, P

ఈమే కెరీర్ మొత్తం ట్రెడిషనల్ గానే కనిపించి ఎంతో మంది కళల దేవత గా మారింది.

Actress Devayani Turns Privet School Teacher, Devayani Daughters, Iniya And, P

ఇక ఈమె తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా నటింస్తుండగానే దర్శకుడు రాజ్ కుమార్ ని ప్రేమించి ఇంట్లో తెలియకుండా రహస్య వివాహం చేసుకుంది.ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఇనియా మరియు ప్రియాంక దేవయాణి ఇన్ని భాషల్లో ఎన్నో సినిమాల్లో పాపులర్ అయినా కూడా ఆమె మాతృ భాషా మాత్రం కొంకణి భాషా.అయితే ఈమె హీరోయిన్ గా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో పెళ్లి చేస్కోవడం పిల్లల్ని కనడం ఇలా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడంతో ఈమెకి అవకాశాలు తగ్గిపోయాయి.

దాంతో దేవయాణి ప్రొడ్యూసర్ గా మారి కొన్ని సినిమాలను నిర్మించడం మొదలుపెట్టింది.అయితే ఆ సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో ఉన్న డబ్బులు కాస్త పోగొట్టుకొని ఆర్ధికంగా బాగా దెబ్బతిని ఇక సినిమాలను వదిలేసి ఒక ప్రెవేట్ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం కూడా చేసింది.

Actress Devayani Turns Privet School Teacher, Devayani Daughters, Iniya And, P

అయితే కొన్నాళ్ల తర్వాత ఆమెని వెతుక్కుంటూ అమ్మ పాత్రలు రావడం మొదలైంది.దాంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది దేవయాణి అలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చినవే ఈ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాలు అంతేకాదు అమ్మగా తమిళ్ అండ్ మలయాళంలో మంచి మంచి సీరియల్స్ లో కూడా నటిస్తూ ఇప్పుడు బిజి యాక్టర్ అయిపోయింది.సో, సినిమా రంగంలో రాణించాలంటే ఎంత పెద్దవాళ్ళకైనా అంత ఈజీ కాదు కానీ అనుకుంటే సాధ్యం కానిదంటూ ఏమి లేదు ఒక్కొక్క టైంలో మన దారులన్నీ మూసుకుపోయాయి అని అనిపిస్తుంది అప్పుడు కృంగిపోకుండా ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలని అర్ధం చేసుకుంటే చాలు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

అలా దేవయాణి తన కెరియర్ మధ్యలో ఎదురైన కష్టాలకు కృంగిపోకుండా ఎదురించి నిలబడి ఇప్పుడు హ్యాపీగా తన కుటుంబంతో తన జర్నీ సాగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు