టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన భూమికా చావ్లా( Bhumika Chawla ) ప్రస్తుతం అక్క, వదిన తరహా పాత్రలలో కనిపిస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.తాజాగా భూమిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్( Sushant Singh Rajput ) మరణం గురించి భూమిక మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.సుశాంత్ చాలా మంచి వ్యక్తి అని ఆమె తెలిపారు.
సుశాంత్ తో మూవీ షూట్ లో పాల్గొనే సమయంలో కొన్ని సన్నివేశాల షూట్ రాంచీలో జరిగిందని ఆమె తెలిపారు.సెట్ లో సుశాంత్ తన లైఫ్ గురించి ఇతర విషయాల గురించి మాట్లాడేవాడని భూమిక చెప్పుకొచ్చారు.
నేను సుశాంత్ మాటలను వింటూ కూర్చునేదానినని ఆమె కామెంట్లు చేశారు.సుశాంత్ మరణ వార్త విన్న సమయంలో నేను ముంబైలో లేనని ఆ వార్తను నేను నమ్మలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు.
సుశాంత్ మరణ వార్త విన్న తర్వాత నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆమె తెలిపారు.ఎం.ఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ( MS Dhoni The Untold Story ) సినిమాలో సుశాంత్ కు అక్క పాత్రలో భూమిక నటించారు.ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించిందనే సంగతి తెలిసిందే.
సుశాంత్ మరణానికి సంబంధించి ఇప్పటికీ అసలు కారణాలు వెలుగులోకి రాలేదు.
భూమిక తెలుగు సినిమాలలో మరింత బిజీ కావాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఆమె కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.భూమిక ఖాతాలో ఎక్కువ సంఖ్యలో ఇండస్ట్రీ హిట్లు ఉన్నా ఆమె ఎక్కువ కాలం సినీ కెరీర్ ను కొనసాగించలేకపోయారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా ఆమె కోరుకున్న విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.కెరీర్ విషయంలో భూమిక ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.