ఎంతో దీనంగా గడిచిన భానుమతి చివరి రోజులు..తెలిస్తే కన్నీళ్లే

భానుమ‌తి.అల‌నాటి మేటిన‌టి.

పురుషాధిక్య సినీ ఇండ‌స్ట్రీలో మ‌గ‌వారికి ఏమాత్రం తీసిపోము అనేలా త‌లెత్తుకు వెండి తెర‌ను ఏలిన న‌టి.

ఆమెతో మాట్లాడాలి అంటేనే ప్రొడ్యూస‌ర్లు, డైరెక్ట‌ర్లు వణికేవారు.

నాటి స్టార్ హీరోల కంటే ఒక్క‌రూపాయి కూడా రెమ్యున‌రేష‌న్ త‌క్కువ తీసుకోను అని చెప్ప‌గ‌లిగిన న‌టీమ‌ణి.ఇందుకు ఎన్టీఆర్‌, ఏఎన్నార సైతం మిన‌హాయింపు కాద‌ని ప్ర‌క‌టించే గ‌ట్స్ ఉన్న హీరోయిన్.

ప్రొడ్యూస‌ర్‌కు న‌ష్ట‌పోవ‌ద్దని భావించేది.త‌న‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని అని భావిస్తే.

Advertisement

పారితోషికం వ‌దులుకునేది.ఆమెతో స‌మానంగా న‌టించాలంటేనే తోటి న‌టులు భ‌య‌ప‌డేవారు.

ఏ క్యారెక్ట‌ర్ ఇచ్చినా.త‌న అభిన‌యంతో వారెవ్వా అనిపించేది.

ఆమె బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి.చ‌క్క‌గా న‌టించ‌డంతో పాటు మంచి స్వ‌రంతో పాటులు పాడేది.

సంగీతంపైనా ప‌ట్టుంది.మంచి ర‌చ‌యిత్రి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

అద్భుత క‌విత‌లు, క‌థ‌లే రాసేది.తోటి హీరోయిన్లు ఎలా ఉన్నా.

Advertisement

తాను మాత్రం హీరోల‌ను డామినేట్ చేసేది.ఆమె న‌ట‌న‌కు గుర్తింపుగా ప‌ద్మ‌శ్రీ ద‌క్కింది.

భానుమ‌తి సినీ జీవితాన్ని అటుంచితే కాసేపు వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడుకుందాం! తొలి సంతానంగా జ‌న్మించిన ఆమె ప‌ద్ద‌తిగా పెరిగింది.ప‌ద్ద‌తితో పాటు పెంకెత‌నం కూడా ఎక్కువ‌గా ఉండేది.

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ రామ‌కృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకుంది.త‌ల్లిదండ్రులు అడ్డు చెప్ప‌డంతో.

పెళ్లికి ఒప్పుకోవాలంటూ ప‌ట్టుప‌ట్టింది.ఓకే చెప్పే వర‌కు దేవుడి గ‌ది నుంచి బ‌య‌ట‌కు రాన‌ని మంకుప‌ట్టు ప‌ట్టింది.

స‌రే అనేవ‌ర‌కు వెన‌క్కి త‌గ్గ‌లేదు.వీరికి భ‌ర‌ణి అనే అబ్బాయి జ‌న్మించాడు.

అత‌డిని డాక్ట‌ర్ చ‌దివించింది.మ‌రో డాక్ట‌ర్‌తో పెళ్లి చేసింది.

కొడుకు, కోడ‌లు అమెరికాలో సెటిల్ అయ్యారు.కొడుకు పేరుతో ఓ స్టూడియో నిర్మించి.సినీనిర్మానాలు చేప‌ట్టింది.

భానుమ‌తి న‌డివ‌య‌సులో ఉండ‌గానే భ‌ర్త రామ‌కృష్ణ స్వ‌ర్గ‌స్తుల‌య్యారు.దీంతో ఒంటరిగానే గ‌డిపింది.

కొంత కాలం వ‌ర‌కు బాగానే ఉన్నా.ఆ త‌ర్వాత ఒంట‌రిత‌నం ఆమెను కుంగ‌దీసింది.

కుటుంబ స‌భ్యులెవ‌రూ తోడులేకుండా గ‌డిపింది.చైన్నైలో భారీ భ‌వంతి ఉన్నా.

ప‌నివాళ్లు స‌హా ఇంకెవ‌రూ ఉండేవాళ్లు కాదు.ద‌గ్గ‌రి మ‌నుషులు లేక ఇబ్బంది ప‌డింది.

మ‌ధుమేహం రావ‌డంతో ఆరోగ్యం సైతం స‌హ‌క‌రించ‌లేదు.న‌ట‌నా జీవితంలో ఎన్నో ఉన్న‌త శిఖ‌రాల‌ను చూసిన ఆమె.చివ‌రి రోజుల‌ను మాత్రం అయిన‌వారితో గ‌డ‌ప‌లేక అవ‌స్థ‌లు ప‌డింది.80 ఏండ్ల వ‌య‌సులో భువి నుంచి దివికి వెళ్లిపోయింది భానుమ‌తి రామ‌కృష్ణ‌.

తాజా వార్తలు