విజయవాడ నగరంలో సినీ నటి ఆరియానా గ్లోరీ సందడి

బందర్ రోడ్ లోని చందన గ్రాండ్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కలెక్షన్స్ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం వివిధ రకాల వస్త్రాలను పరిశీలించడంతోపాటు వాటి ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 Actress Ariyana Glory Launched The Collections Chandana Grand In Bandar Road V-TeluguStop.com

ఈ సందర్భంగా ఆరియానా గ్లోరీ మాట్లాడుతూ తన చిన్నతనంలో క్రిస్మస్ పండుగను తాను ఎంతో సంతోషంగా జరుపుకునే దానిని అని ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేని అన్నారు.క్రిస్మస్ పండుగ సందర్భంగా చందన గ్రాండ్ లో వైవిధ్యంగా వేడుకలు నిర్వహించడంతోపాటు వివిధ రకాల కలెక్షన్స్ తక్కువ ధరకే ప్రజలకు అందించడం శుభపరిణామని ఆమె పేర్కొన్నారుపలు రకాల వస్త్రాలు నగరవాసులను ఎంతగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయని కుటుంబ సమేతంగా చందన గ్రాండ్ లో షాపింగ్ చేయాలని ఆమె నగరవాసులను కోరారు తదనంతరం చందన గ్రాండ్ నిర్వాహకులు మాట్లాడుతూక్రిస్‌మస్‌ వేడుక చేసుకోవటమంటే సాధారణంగా కారోల్స్‌ పాడటం, నోరూరించే స్వీట్లను రుచి చూడటం , బహుమతులను వెంట తీసుకువచ్చే శాంతా కోసం వేచి చూడటం కనిపిస్తుంటుందని చెప్పారు.

మరి ఫ్యాషన్‌ సంగతి కి వస్తే ఫెస్టివల్‌ సీజన్‌ కోసం తాము ప్రత్యేకంగా కలెక్షన్‌ తీసుకురావడంతో పాటుగా వైభవంగా క్రిస్మస్‌ వేడుకలను కూడా ప్రారంభించామని వెల్లడించారుక్రిస్‌మస్‌ బహుమతులను ఎల్లప్పుడూ స్టాకింగ్స్‌లోనే ఎందుకు ఉంచుతారు? అనే ప్రశ్నకు సమాధానం అందించే రీతిలో ఇక్కడ వేడుకలు జరుగనున్నాయని, క్రిస్మస్‌, ఆ వెంటనే వచ్చే న్యూ ఇయర్‌ వేడుకల కోసం కలెక్షన్‌ విడుదల చేశామని వారు వెల్లడిస్తున్నారు.అత్యంత వైభవోపేతంగా నిర్వహించే గ్రాండ్‌ క్రిస్మస్‌ వేడుకలో నూతన కలెక్షన్‌ ఆవిష్కరించడంతో పాటుగా స్టోర్‌ను సందర్శించే వారికి ఉత్సాహపూరిత అనుభూతులను అందించేలా వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు.

ప్రతిఒక్కరికీ ఒకటి అనిపించే రీతిలో ఈ వేడుకలు ఉంటాయని, షాపింగ్‌ పరంగా నగరంలో మునుపెన్నడూ చూడని రీతిలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు.ఈ వేడుకలను బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియానా గ్లోరీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube