ప్రకాష్ రాజ్ ని అలా ఎలా అంటారు.. సినిమాల్లో తెలుగుమ్మాయిలు మాత్రమే ఉన్నారా.. అర్చన కామెంట్స్ వైరల్?

ఈ మధ్య హోరా హోరీగా జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ తరపు నుంచి నామినేషన్ వేసినా ఎన్నికల చివరి వరకు తాను కొనసాగక పోవడానికి గల కారణాలను ప్రముఖ నటి అర్చన వివరించారు.

నిజం చెప్పాలంటే తనకు ఎవరి మీద అంత కోపం చూపించాలని గానీ, అలాంటి వ్యక్తిత్వం గానీ తనకు లేవని అర్చన స్పష్టం చేశారు.

ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషంగా ఉంటూ, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండటం తనకు ఇష్టం అని ఆమె చెప్పారు. విష్ణు ప్యానెల్ లో మొదట్లో ఉన్నపుడు అంతగా ఏం లేదు.

కానీ కొన్ని రోజులయ్యాక ఇద్దరూ కూడా పరస్పర విమర్శలు చేసుకున్నారు.ఆ తరుణంలో కొన్ని స్టేట్మెంట్స్ తనకు నచ్చలేదని, అందుకే తను ఏమీ మాట్లాడలేదని ఆమె చెప్పారు.

అప్పటికీ ప్యానెల్ లో ఉన్నా కానీ మీ అంత అగ్రెసివ్ గా ప్రచారం చేయలేనని ముందే చెప్పాను అని ఆమె వివరించారు.

Advertisement

ప్యానెల్ లో ఉంటాను కానీ వచ్చి ఇంటర్వ్యూస్ లాంటివి చేయలేనని ఆమె చెప్పినట్టు అర్చన తెలిపారు.అంతే కాకుండా తాను ఎవరి గురించి కూడా అలా నెగటివ్ గా మాట్లాడలేనని ఆమె చెప్పుకొచ్చారు.రెండు ప్యానెల్ లోనూ తనకిష్టమైన వాళ్ళు ఉన్నారని ఆమె అన్నారు.

రెండు పక్షాల మధ్య పోటీ ఉన్నపుడు విమర్శలు సహజమే.కానీ అది రాను రానూ మరీ మితి మీరి పోయింది.ముఖ్యంగా ప్రాంతీయత పైన వచ్చిన విమర్శలు తనకు అస్సలు నచ్చలేదని, అవి తనకు చాలా హర్టింగ్ గా అనిపించాయి అని అర్చన తెలిపారు.

ఏదేమైనా విష్ణు ప్యానెల్ గెలిచింది.అందుకు సంతోషమే.కానీ ఆ నాన్ లోకల్ అనే దానిపై వచ్చిన కామెంట్స్ తనకు నచ్చక పోవడం వల్లే తాను బయటికి వచ్చినట్టు ఆమె స్పష్టం చేశారు.

అయినా ప్రకాష్ రాజు గురించి లోకల్ నాన్ లోకల్ అని ఎలా అంటారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం తెలుగు అమ్మాయిలు మాత్రమే లేరుకదా అంటూ ఈ సందర్భంగా నటి అర్చన తెలియజేశారు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు