బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా అనసూయ కి( Anasuya ) ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించక ముందు అనసూయ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.
ఆ తర్వాత జబర్దస్త్ లో( Jabardasth ) యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది.ఇది ఆమె జీవితానికి పెద్ద మలుపు అనే చెప్పాలి.
ఈ షో ఊహించిన దానికంటే ఎక్కువ హిట్ అవ్వడం తో అనసూయ కూడా కోట్లాది మంది ప్రేక్షకుల దృష్టిలో పడింది.ఆ తర్వాత అనేక షోస్ కి యాంకర్ గా పని చేసే అవకాశం ని సొంతం చేసుకుంది.అలా యాంకర్ గా కలలో కూడా ఊహించని రేంజ్ స్టేటస్ ని సొంతం చేసుకున్న అనసూయకి సినిమాల్లో కూడా నటించే అవకాశం దక్కింది.‘క్షణం’ చిత్రం తో ప్రారంభమైన ఆమె కెరీర్ నేడు పాన్ ఇండియన్ క్యారక్టర్ ఆర్టిస్టు రేంజ్ కి ఎదిగేలా చేసింది.

క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కి పుష్ప చిత్రం( Pushpa ) ద్వారా పాన్ ఇండియన్ స్టార్ ఇమేజి దక్కింది.ఇప్పుడు ఈమె కాల్ షీట్స్ కావాలంటే కోట్ల రూపాయిలు చెల్లించాల్సిందే, ఆ రేంజ్ హోదా ని దక్కించుకుంది.ఇదంతా పక్కన పెడితే ఈమెకి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ కూడా మామూలుది కాదు.తనకి సంబంధించిన ప్రతీ విషయాన్నీ అభిమానులతో పంచుకోవడమే కాకుండా, తనకి సంబంధించిన హాట్ ఫోటోలు మరియు వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు ఈమెకి సోషల్ మీడియా లో నెగటివిటీ కూడా మామూలు రేంజ్ ఉండదు.నెటిజెన్స్ చేసే పలు నెగటివ్ కామెంట్స్ కి ఎప్పటికప్పుడు ఇచ్చి పాడేస్తూ ఉంటుంది.
అంతే కాదు ఈమెకి హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అంటే కూడా ఇష్టం ఉండదు.తరచూ అతని మీద ఎదో ఒక నెగటివ్ కామెంట్ చేసి విజయ్ అభిమానులతో తిట్టించుకుంటూ ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఎవరినో పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘ ఎడబాటు గౌరవానికి నా సమాధానం.ఇక నుండి నేను వాదనకి దిగను, ఏమి మాట్లాడినా పట్టించుకోను, సింపుల్ గా మాట్లాడడం మానేస్తా, ఇక సెలవు’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అసలు అనసూయ ఎవరి విషయం లో ఇంత హర్ట్ అయ్యింది?, ఆమె ఎవరిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ పెట్టింది అంటూ నెటిజెన్స్ జుట్టు పీక్కుంటున్నారు, దీనికి అనసూయనే సమాధానం చెప్పాలి.







