టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అనసూయ ( Anasuya ) ఒకరు.ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి అనసూయకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది దీంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.అనసూయ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండేవారు.
ఇక ఈమె పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి.ఎప్పుడైతే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం ( rangasthalam )సినిమాలో ఈమె రంగమ్మత్త పాత్రలో నటించారు.
ఈ పాత్ర ద్వారా అనసూయ విపరీతమైనటువంటి క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈమెకు పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు రావడంతో రెండింటిని మేనేజ్ చేయలేక ఏకంగా బుల్లితెర కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి అనసూయ సినిమాల పరంగా ఇండస్ట్రీలో బిజీగా కొనసాగుతున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా పెద్దకాపు సినిమా ( peddakapu movie )ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో అక్కమ్మ పాత్రలో అనసూయ ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి.సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే తనకు 40 నిమిషాలు సమయం మాత్రమే ఉందని తనని ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగాలంటే అడగొచ్చు అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.ఈ క్రమంలోనే చాలామంది ఈమె నటించిన పెదకాపు( Peda kapu ) సినిమాలోని అక్కమ్మ పాత్ర గురించి కొన్ని ప్రశ్నలు వేశారు.అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీ ఇంట్లో ఎవరు బాగా వంట చేస్తారు మీరు బాగా చేస్తారా లేక మీ ఆయన బాగా చేస్తారా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ మా ఆయన కంటే నేనే బాగా చేస్తాను నేను మా ఆయన కోసం ప్రేమగా వంట చేస్తే మా ఆయన నాకోసం చేస్తారు అంటూ ఈ సందర్భంగా అనసూయ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.అలాగే మరొక నెటిజన్ మీరు ఎన్ని టాటూస్ ( Tatoos ) వేయించుకున్నారు అంటూ కూడా ఈమెను ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను రెండు మాత్రమే వేయించుకున్నానని తెలిపారు.ఒకటి తన చేతి మీద ఉన్నది మరొకటి ఏద భాగంలో ఉన్నదని తెలియజేశారు.అయితే మొదటిది తన భర్తతో ఎంగేజ్మెంట్ జరిగిన ఆరోజు తన భర్త పుట్టినరోజు కూడా కావడంతో తన పేరును ఈమె టాటూగా వేయించుకున్నానని తెలియజేశారు.మరొకటి తన చేతి మీద ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఇలా అనసూయ ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ చెప్పినటువంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.