వైఎస్సార్ గొప్పదనం చెప్పిన నటి అభినయ తండ్రి.. అన్ని లక్షల సాయం చేస్తానని అన్నారంటూ?

మాటలు రాకపోయినా, చెవులు వినబడకపోయినా తన టాలెంట్ తో ఊహించని స్థాయిలో సక్సెస్ అయిన నటీమణులలో అభినయ( Abhinaya ) ఉన్నారు.

ట్రైనర్ ద్వారా ఇంటర్వ్యూలలో మాట్లాడే అభినయ వైఎస్సార్( YS Rajasekhar Reddy ) గొప్పదనం గురించి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

చెవులు వినిపించని వాళ్లు చదువుకోవడం కష్టమని ప్రస్తుతం పరిస్థితి కొంత మారిందని ఆమె అన్నారు.ఒక సందర్భంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు కారు విండో ఓపెన్ చేసి పాప సమస్య గురించి తెలిసి ఆరోగ్యశ్రీ( Aarogya Sri ) ద్వారా అభినయకు చికిత్స చేయిస్తానని చెప్పారని అభినయ తండ్రి( Abhinaya Father ) కామెంట్లు చేశారు.11 లక్షల రూపాయలు సర్జరీ కోసం ఖర్చు చేస్తామని చెప్పారని అభినయ తండ్రి పేర్కొన్నారు.అయితే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి యాక్సిడెంట్ లో మరణించారని అభినయ తండ్రి పేర్కొన్నారు.

అభినయ సర్జరీ కోసం బంధువులు, సన్నిహితులు సాయం చేశారని అభినయ తండ్రి తెలిపారు.

చిన్న వయస్సులో నాకు ఒక సర్జరీ( Surgery ) జరిగిందని ఆ సర్జరీ సమయంలో నేను చాలా ఇబ్బందులు పడ్డానని అభినయ పేర్కొన్నారు.డెఫ్, డంబ్ అని కామెంట్ చేసేవాళ్లకు అందులో ఉండే డిసబిలిటీస్ తెలియదని ఆమె అన్నారు.అభినయ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావడంతో పాటు మరిన్ని విజయాలు అందుకోవాలనేది ఫ్యాన్స్ కోరిక కాగా అభినయకు వరుస మూవీ ఆఫర్లు మాత్రం రావడం లేదనే చెప్పాలి.

Advertisement

అభినయ రెమ్యునరేషన్( Abhinaya Remuneration ) సైతం పరిమితంగా ఉందని తెలుస్తోంది.అభినయకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఛాన్స్ ఇస్తే ఆమె ప్రూవ్ చేసుకుంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అభినయకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అభినయ తర్వాత సినిమాలతో సైతం భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు