సినిమాల కోసమే “నాన్-వెజ్” మానేసిన 8 యాక్టర్స్‌.. ఎవరంటే..??

సినిమాల్లోని క్యారెక్టర్స్‌కు 100% న్యాయం చేయడానికి యాక్టర్స్ ఎంతో కష్టపడుతుంటారు.పూర్తి డెడికేషన్ తో ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు.

అవసరమైతే బరువు తగ్గుతారు, బరువు పెరగమన్నా అలానే చేస్తారు.యాక్టర్ అన్న తర్వాత అన్ని పాత్రలు చేయాలి.

ఆ మాటకు వీళ్ళు కట్టుబడి ఉంటారు.పవిత్రమైన పాత్రలు చేయడానికి కూడా సిద్ధమవుతారు.

వాటిని పోషించేటప్పుడు నాన్ వెజ్ కూడా మానేస్తారు.తెలుగులో దేవుడు పాత్రలను ఎంతోమంది పోషించారు వారిలో కొందరు ఆ రోల్స్ చేసేటప్పుడు నాన్ వెజ్ కూడా మనేశారు.

Advertisement

వాళ్లెవరో తెలుసుకుందామా.

సీనియర్ ఎన్టీఆర్

శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి పౌరాణిక పాత్రల్లో సీనియర్ ఎన్టీఆర్ మెరిసారు.ఇలాంటి దేవుళ్ల పాత్రలను వేసేటప్పుడు ఎన్టీఆర్ నాన్ వెజ్ ఫుడ్స్ తినే వారు కాదు.ఆ సినిమాలు పూర్తయ్య దాకా నిష్టగా ఉండేవారట.

కింగ్ నాగార్జున

:

అక్కినేని నాగార్జున సాయి బాబా పాత్రలో నటించిన మూవీ ‘షిర్డీ సాయి’.ఈ సినిమాని రాఘవేంద్రరావు తెరకెక్కించారు.

డైరెక్టర్ తేజ పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఆయన ఏ సినిమా చేస్తున్నాడు..?
జగన్ చేస్తున్న డిమాండ్ అమలు సాధ్యమేనా ? 

ఈ మూవీలో నాగార్జున సాయిబాబాగా నటించడంతో ఆ మూవీ పూర్తి అయ్యేవరకు ఎలాంటి మాంసాహారం తీసుకోలేదట.

అల్లు అర్జున్

Advertisement

అల్లు అర్జున్, హరీష్ శంకర్ కలిసి డీజే - దువ్వాడ జగన్నాథం సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఇందులో బన్నీ బ్రాహ్మణుడిగా నటించాడు.బ్రాహ్మణులు స్వచ్ఛమైన శాఖహారులు కాబట్టి ఆ క్యారెక్టర్ చేసినన్ని రోజులు బన్నీ నాన్ వెజ్ తినకుండా ఉన్నారట.

బ్రాహ్మణులకు అల్లు అర్జున్ ఇచ్చిన గౌరవం అది.నాన్ వెజ్ తినకుండా దువ్వాడ జగన్నాథం షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకు ఆయన ఉండటం విశేషం.

పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ (Pawan Kalyan, Sai Dharam Tej ) కలిసి బ్రో మూవీ చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో పవన్ కాల దేవుడి క్యారెక్టర్ చేశారు.ఈ సినిమా పూర్తి అయ్యేదాకా పవన్ కూడా నాన్ వెజ్ ఫుడ్స్‌కు దూరంగా ఉన్నారు.

రిషబ్ శెట్టి

హీరో రిషబ్ శెట్టి కూడా కాంతర మూవీ( Kantara Movie ) షూటింగ్ సమయంలో నాన్ వెజ్ మానేశాడు. దైవ కోలా సీక్వెన్స్ షూటింగ్‌కు ముందు 20-30 రోజులు నాన్ వెజ్‌కి దూరంగా ఉన్నానని రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు.

అక్షయ్ కుమార్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ "ఓ మై గాడ్ 2( Oh My God 2 )"లో లార్డ్ శివగా కనిపించాడు.ఓ మై గాడ్ మూవీలో కృష్ణుడిగా అలరించాడు.ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తి అయ్యేవరకు మాంసాహారానికి దూరంగా ఉన్నాడట.

అక్షయ్ తల్లి చెప్పడంతో ఆ పని చేసినట్లు తెలిసింది.

రణదీప్ హుడా

బాలీవుడ్ యాక్టర్ రణదీప్ హుడా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ సినిమా చేస్తున్నప్పుడు మద్యం, నాన్ వెజ్ ఫుడ్ తినడం మానేశాడు.

పరిణీతి చోప్రా

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ‘కోడ్ నేమ్ తిరంగ( Parineeti Chopra )’ అనే మూవీ షూటింగ్ సమయంలో నాన్ వెజ్ ఫుడ్స్‌కు దూరంగా ఉందట.

తాజా వార్తలు