సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వారి పాత్రలకు అనుగుణంగా నటించాల్సి రావడం సర్వసాధారణం.చాలామంది హీరోలు ద్విపాత్రాభినయంలో తండ్రి కొడుకులుగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లు తండ్రి పాత్రలలో నటించిన హీరో సరసన హీరోయిన్లుగా నటించి ఉంటారు.అలాగే కొడుకు పాత్రలో నటించిన హీరో పక్కన హీరోయిన్గా కూడా నటించిన సందర్భాలు ఉంటాయి.
ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి త్రిష (Trisha ) కూడా ఇలా ఒకే హీరోతో అన్ని పాత్రలలో నటించారని చెప్పాలి.
ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి త్రిష ఇప్పటికీ హీరోయిన్గా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.ఇక త్రిష ఇండస్ట్రీలో ఒక హీరోతో ప్రియురాలిగా రొమాన్స్ చేసి, అలాగే అదే హీరోతోనే కూతురిగాను కోడలిగా కూడా నటించారు.మరి త్రిష ఒకే హీరోతో ఇన్ని రకాల పాత్రలు పోషించినటువంటి ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…
త్రిష ఇలా ఒకే నటుడితో ఇన్ని రకాల పాత్రలలో నటించిన ఆ నటుడు మరెవరో కాదు ప్రకాష్ రాజ్( Prakash Raj ) ఈయన ఎన్నో విలక్షణమైనటువంటి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక త్రిష ప్రకాష్ రాజ్ తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.ఇక ప్రభాస్ త్రిష కాంబినేషన్లో వచ్చిన వర్షం సినిమాలో త్రిషకు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమాలో డబ్బు పిచ్చి ఉన్నటువంటి ఒక తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారు.
ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా త్రిషకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి.
ఇక హీరో సిద్ధార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరోకి తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు.ఈ సినిమాలో హీరో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడంతో త్రిషకు ప్రకాష్ మామగా మారిపోయారు ఈ సినిమాలో మామగా నటించినటువంటి ప్రకాష్ రాజ్ మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమాను తమిళ్ లో విజయ్ హీరోగా గిల్లీ పేరుతో రీమేక్ చేశారు.ఇందులో త్రిష హీరోయిన్ గా కాగా.
ఆమెకు ప్రియుడిగా విలన్ పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు ఆ విధంగా ప్రకాష్ రాజ్ త్రిషకు ప్రియుడిగాను తండ్రిగాను మామ పాత్రలలోను నటించినటువంటి ఏకైక నటుడు అని చెప్పాలి.