ఆర్య, ఆర్య 2 సినిమాల తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం పుష్ప సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.గతంలో అల్లు అర్జున్ ను క్లాస్ గా చూపించిన సుకుమార్ ఈ సినిమాలో మాత్రం ఊరమాస్ గా చూపించబోతున్నారు.
అల్లు అర్జున్ ఈ సినిమాలో గంధపుచెక్కలను స్మగ్లింగ్ చేసే లారీడ్రైవర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం.అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న ఈ సినిమాలో నటిస్తోంది.
అయితే ఈ సినిమాకు విలన్ ను ఫైనలైజ్ చేయడం దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారింది.మొదట అల్లు అర్జున్ కు విలన్ గా విజయ్ సేతుపతిని సుకుమార్ ఫైనలైజ్ చేశారు.
పుష్ప మూవీ మేకర్స్ సినిమాను తమిళంలో కూడా విడుదల చేస్తామని చెప్పడంతో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.ఆ తరువాత సుకుమార్ సుదీప్, ఇతర నటులను ఈ పాత్ర కోసం సంప్రదించినా ఎవరూ ఫైనల్ కాలేదు.

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సుకుమార్ ఈ సినిమాలో విలన్ పాత కోసం విలక్షణ నటుడు విక్రమ్ ను సంప్రదించనున్నారని తెలుస్తోంది.విక్రమ్ ఈ సినిమాలో నటిస్తే సినిమాకు తెలుగుతో పాటు తమిళంలోను క్రేజ్ ఏర్పడుతుందని సుకుమార్ భావిస్తున్నట్టు సమాచారం.ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించే టాలెంట్ ఉన్న విక్రమ్ ఈ సినిమాలో విలన్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాల్సి ఉంది.
విక్రమ్ పుష్ప సినిమాలో నటిస్తే పుష్ప సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయమని చెప్పవచ్చు.
సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో సుకుమార్ అతని టీమ్ ను విక్రమ్ ను సంప్రదించనున్నట్టు వార్తలు వస్తుండగా పుష్ప మూవీ టీమ్ నుంచి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.అల్లు అర్జున్ కు విలన్ గా అపరిచితుడు నటిస్తే మాత్రం టాలీవుడ్ లో కొత్త కలెక్షన్ల రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.