తారక్ మూవీ విషయంలో వేణు అన్యాయం జరిగిందా.. ఏం జరిగిందంటే?

సినిమా రంగంలో దర్శకనిర్మాతలు కొన్నిసార్లు చెప్పిన కథకు సినిమాల్లోని పాత్రలకు పొంతన ఉండదనే సంగతి తెలిసిందే.

రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలో వేణు కీలక పాత్రలో నటించగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేణు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

దమ్ము సినిమాలో వేణు కీలక పాత్రలో నటించగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

దమ్ము సినిమాకు వేణు పాత్ర ప్లస్ కాకపోగా మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.ఈ సినిమా గురించి వేణు మాట్లాడుతూ దమ్ము సినిమాలో తన పాత్ర గురించి బోయపాటి శ్రీను చెబుతూ షోలే సినిమాలో అమితాబ్ తరహా పాత్రలా ఉంటుందని అన్నారని వెల్లడించారు.ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని వేణు తెలిపారు.

ఆ సినిమాలో అమితాబ్ చనిపోయిన విధంగా దమ్ము సినిమాలో నేను చనిపోయానని వేణు చెప్పుకొచ్చారు.రవితేజతో కలిసి నటించడం ఆనందంగా ఉందని వేణు కామెంట్లు చేశారు.

Advertisement

భారీ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం ద్వారా ప్రేక్షకులకు మళ్లీ దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుందని ఆ కారణం వల్లే ఈ సినిమాకు ఓకే చెప్పానని వేణు పేర్కొన్నారు.రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వేణు కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

వేణు మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో వేణు ఒకరనే సంగతి తెలిసిందే.సరైన పాత్రలు పడితే వేణు కెరీర్ కచ్చితంగా పుంజుకుంటుందని చెప్పవచ్చు.సినిమాసినిమాకు వేణు రేంజ్ పెరుగుతుండగా వేణు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

వేణు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు