ఈ నటుడు గొప్పోడే.. పుస్తకాల కోసం పనికెళ్లే స్టేజ్ నుంచి కొత్త కారు కొనే స్టేజ్ కు ఎదగడంతో?

Actor Tiruveer Success Story Details Here Goes Viral In Social Media , Tiruveer , Social Media , Car ,Tirupati Reddy , Remuneration , Masooda, Tollywood, Kollywood

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులలో తిరువీర్ ఒకరు.రంగస్థల నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన తిరువీర్ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.

 Actor Tiruveer Success Story Details Here Goes Viral In Social Media , Tiruveer-TeluguStop.com

తిరువీర్ మసూద సినిమా( Masooda )లో తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.పరేషాన్ సినిమాతో తిరువీర్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే.

తిరువీర్ ( tiruveer )పలు బోల్డ్ సినిమాలలో కూడా నటించారు.ప్రస్తుతం ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు కీలక పాత్రల్లో నటిస్తూ తిరువీర్ సత్తా చాటుతున్నారు.

పలాస, జార్జ్ రెడ్డి సినిమాల విజయాలతో తిరువీర్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.తిరువీర్ నాటక రంగ గురువు పేరు రఘువీర్ కాగా ఆయన పేరు నుంచి వీర్ తీసుకుని తిరుపతిరెడ్డి అనే పేరును ఈ నటుడు తిరువీర్ గా మార్చుకోవడం గమనార్హం.

తాజాగా తిరువీర్ కొత్త కారును కొనుగోలు చేశారు.సోషల్ మీడియా వేదికగా తిరువీర్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను తిరువీర్ షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.“ఇక యెండ వానల వల్ల పరేషాన్ లేదు.ఫ్యామిలీ లోకి కొత్త పిల్లగాడు వచ్చిండు, ఎల్కం.

మీ ప్రేమ వల్లనే ఇదంతా మస్త్ ఖుషీగా ఉంది!!!” అని తిరువీర్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

పారిశ్రామికవాడలో తిరువీర్ తండ్రి పని చేయగా పుస్తకాలు కొనుక్కోవడం కోసం తిరువీర్ కూడా పనికి వెళ్లేవారు.ఎంతో కష్టపడి తిరువీర్ ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.వరుస విజయాలతో తిరువీర్ రెమ్యునరేషన్( Remuneration )కూడా పెరుగుతోందని తెలుస్తోంది.

తిరువీర్ కు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.తిరువీర్ కు సోషల్ మీడియాలో కూడా క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

కెరీర్ విషయంలో తిరువీర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube