యంగ్ టైగర్ ఎన్టీఆర్( Ntr ) త్వరలోనే దేవర సినిమా ( Devara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు అందరూ కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేసాయి.ఇక ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంది.
ఎన్టీఆర్ సినీ కెరియర్ లోనే ఈ సినిమాకు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాపై సీనియర్ హీరో సుమన్ ( Suman )స్పందిస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నటుడిగా ఎన్టీఆర్ ఎంతో అదృష్టవంతుడు తన సినిమా విడుదల కాకముందే ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకోవడం అనేది మామూలు విషయం కాదు.ఇలాంటి రికార్డ్స్ అందరి హీరోలకు సాధ్యం కాదని తెలిపారు.
ఎన్టీఆర్ చిన్నప్పటినుంచి క్లాసికల్ డ్యాన్సర్.అందుకే ఆయన ఏ డ్యాన్స్ వేసినా గ్రేస్ ఉంటుంది.
డైలాగ్స్ చెప్పడం ఎన్టీఆర్ కి చిన్నప్పటినుంచి అలవాటు.
ఇక ఫైట్స్‌పై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆర్టిస్ట్‌గా తెరపై ఏం చేయాలనే విషయం తారక్‌కు బాగా తెలుసు.ఈయన ఎంతో అంకితభావం నిబద్ధత ఉన్న వ్యక్తి.
ఏదైనా ఒక సన్నివేశం గురించి తన టీం అందరితో చర్చలు జరపడమే కాకుండా తనకు తోచిన సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు.ఇలాంటి ఒక గొప్ప నటుడితో తిరిగి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని సుమన్ ఈ సందర్భంగా ఎన్టీఆర్ దేవరపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో దమ్ము ( Dammu) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.