టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వేర్వేరు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.బాలయ్యకు కోపం చాలా ఎక్కువని చిన్న విషయానికి కూడా సీరియస్ అవుతారని చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే వకీల్ సాబ్, అఖండ సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సమ్మెట గాంధీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఖండ మూవీ ఫస్ట్ సీన్ షూట్ నాతోనే ప్రారంభమైందని ఆయన అన్నారు.
డైరెక్టర్ బోయపాటి శ్రీను రైతు వేషం ఉందని చెప్పి నన్ను పిలిపించారని ఆయన కామెంట్లు చేశారు.
డైలాగ్ చెప్పి కొబ్బరికాయ కొట్టే సీన్ ను బోయపాటి శ్రీను చేయించారని అయితే ఆ సీన్ సినిమాలో లేదని సమ్మెట గాంధీ అన్నారు.ఆ సమయంలో సింహా, లెజెండ్ సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకున్నానని సమ్మెట గాంధీ చెప్పుకొచ్చారు.
బాలయ్యకు కోపం ఎక్కువని నమస్కారం పెట్టకూడదని కొంతమంది చెప్పారని సమ్మెట గాంధీ కామెంట్లు చేశారు.
తాను తొలిరోజే నమస్కారం అని బాలయ్యకు చెప్పగా బాలయ్య నాకు రివర్స్ లో నమస్కారం చెప్పారని ఆయన తెలిపారు.

తాను, బాలయ్య కాంబినేషన్ లో తీసిన సీన్ లో సగం సీన్ కట్ అయిందని సమ్మెట గాంధీ చెప్పుకొచ్చారు.బాలయ్య తనకు నటన విషయంలో సూచనలు ఇచ్చేవారని ఆయన వెల్లడించారు.బాలయ్య మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని కల్మషం లేని వ్యక్తి సమ్మెట గాంధీ కామెంట్లు చేశారు.

అఖండ సక్సెస్ మీట్ లో తాను మాట్లాడి బాలయ్యకు ఇష్టమైన పద్యాలను తాను చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు.వకీల్ సాబ్ సినిమాలో సీన్ కోసం ఒక పూటంతా పరుగెత్తానని తన వయస్సు ప్రస్తుతం ఏడు పదులు అని ఆయన అన్నారు.సినిమాలో ఆ సీన్ కేవలం 6 సెకన్లు మాత్రమే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.







