తెలుగు సినిమా ఇండస్ట్రీలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కామెడీ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.కామెడీ సినిమాలలో హీరోగా తన హావభావాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
అన్నగారు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేంద్రప్రసాద్ కెరియర్ మొదట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకున్నారు.అనంతరం ఈయన బాపు దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించారు.ఇప్పటికీ యంగ్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్ తన సినీ కెరియర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం తెలిస్తే షాక్ అవుతారు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా పేరు పొందిన రాజేంద్రప్రసాద్ తన సినీ కెరియర్లో అత్యధికంగా తీసుకున్న రెమ్యూనరేషన్ కేవలం 35 లక్షల రూపాయలు మాత్రమే.హాలీవుడ్ సినిమా క్విక్ గన్ మురుగన్ రాజేంద్రప్రసాద్ కెరీర్‌లో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాకి గాను ఈయన 35 లక్షల రూపాయల అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుని స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈయన మాత్రం ఎప్పుడు నిర్మాతలను రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేయలేదని అర్థమవుతుంది.