తాగి కారు డ్రైవ్‌ చేసి పైగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోలను రాజశేఖర్‌ అంత మాట అనేశాడేంటి

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌ ఇటీవల కారులో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్‌ అయిన విషయం తెల్సిందే.

యాక్సిడెంట్‌ వార్త తెలిసిన వెంటనే చాలా మంది ఆయన పరిస్థితి గురించి వాకబు చేశారు.

అయితే ఆయన కుటుంబ సభ్యులు అంతా కూడా ఆయన క్షేమంగా ఉన్నాడంటూ తెలియజేశారు.అదే రోజు మీడియా ముందుకు వచ్చిన రాజశేఖర్‌ తాను క్షేమంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Actor Rajashekar Comments On Tollywood Cinima Industrie

రాజశేఖర్‌ యాక్సిడెంట్‌ వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.కారు నుజ్జు నుజ్జు అవ్వడంతో రాజశేఖర్‌ పరిస్థితి ఎలా ఉందా అంటూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు.కాని రాజశేఖర్‌కు బాగానే ఉందని తెలిసిన తర్వాత తేలిక పడ్డారు.

Advertisement
Actor Rajashekar Comments On Tollywood Cinima Industrie-తాగి కార�

అయితే రాజశేఖర్‌ తాగి డ్రైవ్‌ చేశాడని అంతా కన్ఫర్మ్‌ చేశారు.పోలీసులు కారులో మద్యం బాటిల్స్‌ ఉండటంతో పాటు తాగిన గ్లాస్‌ కూడా ఉందని గుర్తించారు.

తాగి దాదాపుగా 180 స్పీడ్‌తో ఉన్న రాజశేఖర్‌ కారు అదుపు తప్పింది.ఆ కారణంగానే ప్రమాదం జరిగింది.

Actor Rajashekar Comments On Tollywood Cinima Industrie

తాగి యాక్సిడెంట్‌ చేసిన రాజశేఖర్‌ ఇటీవల మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయంటూ నెటిజన్స్‌ అంటున్నారు.నాకు యాక్సిడెంట్‌ అయితే చాలా మంది అసలు పట్టించుకోలేదు.నాకేంటి అన్నట్లుగా ఎవరి పనిలో వారు ఉన్నారు.

ఇండస్ట్రీలో ఇంత మంది సంస్కార హీనులు ఉన్నారా అనిపిస్తుంది.ఈమద్య కాలంలో ఇండ్రస్టీలో ఎవరు ఎటు పోతే నాకేంటి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!

అలాంటి వారు ఎక్కువ అవ్వడంతోనే ఒకరి మద్య ఒకరికి సన్నిహిత సంబంధాలు లేకుండా పోయాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.తాగి డ్రైవ్‌ చేశావు, నీ పరిస్థితి బాగానే ఉంది.

Advertisement

అయినా కూడా నిన్ను పరామర్శించాల్సిన అవసరం ఏంటీ అంత చిన్న విషయానికి సంస్కారం వరకు వెళ్లాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.నీకే సంస్కారం మంచి గుణం ఉండి ఉంటే నీవు ఇలా తాగి కారు నడిపి యాక్సిడెంట్‌ చేసేవాడివేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు