సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు సెకండ్ ఇన్నింగ్స్( Second Innings ) స్టార్ట్ చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు.అయితే ఒకప్పుడు హీరోగా చేసిన చాలా మంది నటులు సెకండ్ ఇన్నింగ్స్ లో అదిరిపోయే క్యారెక్టర్లు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంటున్నారు.
ఇక అందులో భాగంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే జగపతిబాబు,శ్రీకాంత్ లాంటి వారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విలన్ లుగా చేస్తూ వాళ్ళకంటూ సపరేట్ గుర్తింపును సంపాదించుకున్నారు.ఇప్పుడు అలాంటి మరికొందరు స్టార్ హీరోలు కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వీళ్ల కోవలోకే చేరిపోతున్నారు.
ముఖ్యం గా యాంగ్రీ యంగ్ మ్యాన్( Angry Young man Rajasekhar ) గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ నితిన్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న ఎక్స్ ట్ర( Extra ) అనే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా గనక హిట్ అయితే రాజశేఖర్ కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు వస్తాయి.ఇక దాంతో పాటుగా మరి కొంతమంది నటులు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారుతున్నారు.ఇంకా ఇలాంటి క్రమంలో రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతవరకు రాణిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
జగపతిబాబు లెజెండ్ సినిమాతో అద్భుతమైన క్రేజ్ ని తెచ్చుకున్నాడు.
జగపతిబాబు( Jagapathi Babu ) లానే రాజశేఖర్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక రాజశేఖర్ తో పాటుగా మరో సీనియర్ నటుడు అయిన వడ్డే నవీన్ కూడా ఇండస్ట్రీలో ఒక మంచి క్యారెక్టర్ తో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా( Character Artist ) తన లక్ ని పరీక్షించుకోవడానికి మన ముందుకు రాబోతున్నాడు.అయితే ఆయన ఏ సినిమాలో చేస్తున్నాడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ తను మాత్రం సినిమాల్లో చేయడానికి ఇష్టపడుతూ కొన్ని స్టోరీలను కూడా వింటున్నట్టుగా తెలుస్తుంది…
.