సీనియర్ నటుడు అప్పుల్లో ఉన్నాడని ప్రకాష్ రాజ్ ఏం చేసాడో తెలుసా.....

మామూలుగా సినిమా ఇండస్ట్రీ అంటే కోట్లు సంపాదించిన వాళ్ళనీ చూస్తుంటాం, మరోవైపు అదృష్టం కలిసి రాక కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళని చూసి చూస్తుంటాం. అయితే సినీ టాలీవుడ్ లో అన్న, తమ్ముడు, విలన్ ఇలాంటి పాత్రలు  పోషించడమే కాకుండా పలువురు స్టార్ హీరోలకు మేనేజర్ గా వ్యవహరించినటువంటి నటుడు రాజారవీంద్ర గురించి తెలియని వారుండరు.

 Actor Raja Ravindra Comment On Prakash Raj Telugustop-TeluguStop.com

 తాజాగా రాజా రవీంద్ర ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు ఇందులో భాగంగా తన జీవితంలో చూసినటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంటాడు.

తాను మేనేజర్ గా వ్యవహరించిన నటీనటుల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒకరని చెప్పుకొచ్చాడు.

 Actor Raja Ravindra Comment On Prakash Raj Telugustop-సీనియర్ నటుడు అప్పుల్లో ఉన్నాడని ప్రకాష్ రాజ్ ఏం చేసాడో తెలుసా#8230;..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాక ప్రకాష్ రాజ్ గురించి పలు ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించాడు.ఇందులో ప్రకాష్ రాజ్ గురించి చెబుతూ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఓ సీనియర్ ఆర్టిస్ట్ అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లోకి వెళ్ళిపోయాడు.

అయితే వేరే వాళ్ల ద్వారా ఈ విషయం తెలుసుకున్న టువంటి ప్రకాష్ రాజ్ తనని ఇంటికి పిలిచి విషయం గురించి తెలుసుకొని 50 లక్షల రూపాయలను ఇచ్చి ఆదుకున్నాడని తెలిపారు.అంతేగాక తన జీవితంలో డబ్బుకి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ మనుషులకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే నటుల్లో ప్రకాష్ రాజ్ ని మాత్రమే చూశానని అన్నారు.

అయితే ప్రకాష్ రాజు చాలా సింపుల్ గా ఉంటారని దేనికి ఎక్కువగా రియాక్ట్ కారని ఒకవేళ ఏ విషయం గురించైనా ప్రస్తావించాలి అంటే ఆ విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మాత్రమే మాట్లాడుతారని లేదంటే అర్తజ్ఞానం తో మాట్లాడుతూ ఇంకొకరు మనసు నొప్పించే పనులు చేయరని అన్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా గత కొద్దికాలంగా ప్రకాష్ రాజ్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.అంతేకాక గత సంవత్సరంలో జరిగినటువంటి కర్ణాటక పాలిటిక్స్ లో కూడా పాల్గొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube