కృష్ణ వంశీ దర్శకత్వం లో నటించాలి అని ప్రతి హీరో కి ఉంటుంది ఎందుకంటే కృష్ణ వంశీ ప్రతి హీరో ని కొత్త గా చూపిస్తాడు అందుకే ప్రతి హీరో తన ఎంటైర్ కెరియర్ లో ఒక్క సరైన కృష్ణ వంశీ డైరెక్షన్ లో నటించాలి అనుకుంటారు అయితే ఇదంతా ఒకప్పటి కృష్ణ వంశీ గురించి ఇప్పుడు కృష్ణవంశీ సినిమాలు చాలా స్లో గా చేస్తున్నాడు పైగా అతని మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది.అయినప్పటికీ ప్రస్తుతం ప్రకాష్ రాజ్, బ్రహ్మనందంలని లీడ్ రోల్ లో పెట్టి రంగ మార్తాండ సినిమా చేస్తున్నాడు ఇక ఇది ఇలా ఉంటె పైసా సినిమా ప్లాప్ తర్వాత కృష్ణవంశీ కి చిరంజీవి పిలిచి మరి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
ఏంటంటే రామ్ చరణ్ తో ఒక ఫ్యామిలీ సబ్జెక్టు చేయమని చెప్పాడట దాంతో రాంచరణ్ కోసం ఒక ఫ్యామిలీ సబ్జెక్టు రెడీ చేసాడు… తొదరగానే షూటింగ్ కూడా పూర్తి చేసాడు.మొత్తం సినిమాని చూసిన కృష్ణ వంశీ కి ఆ సినిమా లో చరణ్ తాతగా చేసిన రాజ్ కిరణ్ గారి యాక్టింగ్ బాగున్నా చరణ్ కి తాత గా సెట్ కావట్లేదని ఇద్దరి మధ్య తాత మనవడు అనే ఫీల్ రావట్లేదని అనుకొని కృష్ణవంశీ చిరంజీవి గారి తో మాట్లాడి మళ్ళి ఆ క్యారెక్టర్ కోసం ప్రకాష్ రాజ్ ని తీసుకొని స్టార్టింగ్ నుంచి ఆయన ఎపిసోడ్స్ మొత్తం రీషూట్ చేసాడు.

అప్పుడు సినిమా బాగా వచ్చింది.కానీ ఇంతకు ముందు ఆ క్యారెక్టర్ చేసిన రాజ్ కిరణ్ మూవీ డైరెక్టర్ అయిన కృష్ణ వంశీ తో గొడవ పెట్టుకున్నట్టు తెలిసింది సీనియర్ ఆర్టిస్ట్ ని అయిన నాకు అసలు ఏం చెప్పకుండా నన్ను సినిమా నుంచి తీసేసి ఇంకొకరితో ఎలా షూట్ చేస్తారు అని గొడవ చేయడం తో చిరంజీవి వచ్చి ఆ గొడవని సెట్ చేసినట్టు ఇండస్ట్రీ లో చెప్పుకుంటారు…ఆ వివాదం ముగిసిన తర్వాత మొత్తానికి గోవిందుడు అందరివాడేలే సినిమా రిలీజ్ అయింది.

ఈ సినిమా మొత్తానికి యావరేజ్ హిట్ గా నిలిచింది.అలా ఒక క్యారెక్టర్ తో మొత్తం సినిమా తీసి ఆ తర్వాత మళ్ళి ఇంకో ఆర్టిస్ట్ తో ఆక్యారెక్టర్ ని రీప్లేస్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి.ముఖ్యంగా ఇలాంటివి పెద్ద సినిమాలకే ఎక్కువ గా జరుగుతాయి ఎందుకంటే ఒకసారి సినిమా తీసాక ఒక క్యారెక్టర్ నచ్చకపోతే మొత్తం సినిమా డిస్ట్రబ్ అవుతుందని తెలిసి ఆ ఒక్క క్యారెక్టర్ వరకే వేరే వాళ్ళని పెట్టి రీషూట్ చేస్తారు అలా రీషూట్ చేసి హిట్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి…
.







