ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన పింగ్ పాంగ్ సూర్య సినిమాలలో కామెడీ రోల్స్ లో ఎక్కువగా నటించి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.బాహుబలి సినిమా షూటింగ్ కోసం కేరళలో 25 రోజులు ఉన్నామని ఆయన అన్నారు.
సినిమాలో వాటర్ ఫాల్స్ అంతా కేరళ అని పింగ్ పాంగ్ సూర్య కామెంట్లు చేశారు.
నాలుగు వాహనాలలో ఫైటర్స్ ఉండేవారని పింగ్ పాంగ్ సూర్య అన్నారు.
అడవిలో 25 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నామని సూర్య తెలిపారు.రాజమౌళి గారిలో నేను లీడర్ ను చూశానని ఆయన వెల్లడించారు.అడవిలో చెట్లు పడిపోతే వాటిని టచ్ చేస్తే కేసు అవుతుందని మేము ఆగిపోయామని రాజమౌళి గారు ధైర్యం చెప్పి ఆ చెట్లను కట్ చేయించారని ఆయన పేర్కొన్నారు.
20 నిమిషాలలో 2 చెట్లను క్లియర్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు.

బాహుబలి షూటింగ్ సమయంలో అడవిలో ఉండటంతో జలగలు రక్తం పీల్చేశాయని పింగ్ పాంగ్ సూర్య అన్నారు.చిరంజీవి గారు లెజెండ్ అని ఆయన ప్రేక్షకుల మెప్పు పొందే సినిమాలు చేయాలని భావిస్తారని ఆయన పేర్కొన్నారు.ఆ నలుగురు సినిమా నుంచి నాలో మార్పు మొదలైందని పింగ్ పాంగ్ సూర్య కామెంట్లు చేశారు.

ఆ నలుగురు సినిమా వల్లే నేను నిర్మాతగా మారి కలియుగ సినిమాకు నిర్మాతగా వ్యవహరించానని ఆయన తెలిపారు.సినిమా వాళ్లకు ఎవరూ అప్పులు ఇవ్వరని ఆయన చెప్పుకొచ్చారు.సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలన్నా పాతిక లక్షల రూపాయలు కావాలని ఆయన తెలిపారు.
గతంలో నేను ఒక కేసులో చిక్కుకోగా పాతిక లక్షల రూపాయలు ఇస్తే సెటిల్ చేస్తానని ఒక వ్యక్తి కాల్ చేశాడని పింగ్ పాంగ్ సూర్య అన్నారు.సూర్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







