త్రిషను బెడ్ రూమ్ కు తీసుకెళ్దామనుకున్నా.. మన్సూర్ చెత్త వ్యాఖ్యలు.. త్రిష రియాక్షన్ ఏంటంటే?

తమిళ హీరో విజయ్ తాజాగా నటించిన చిత్రం లియో( Leo ). ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తమిళంలో తప్ప మిగిలిన అన్ని భాషల్లో నెగిటివ్ టాక్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 Heroine Trisha Krishnan Reacts To Mansoor Ali Khan Remarks, Mansoor Ali Khan,tr-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా మన్సూర్ అలీ ఖాన్ స్టార్ హీరోయిన్ త్రిష( Heroine Trisha )ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కోలీవుడ్ సినీ తారలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.అంతేకాకుండా ఇలాంటి వారికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ మేరకు మన్సూర్ వ్యాఖ్యలపై హీరోయిన్ త్రిష స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

కాగా ఆ ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.మన్సూర్ అలీ ఖాన్( Mansoor Ali Khan ) నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది.నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా అనిపిస్తోంది.అతని లాంటి నీచమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను ఇక పై ఎప్పుడూ పంచుకోను.

నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను.అతని లాంటి వారి వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది అని రాసుకొచ్చింది త్రిష.

ఆ పోస్ట్ పై స్పందిస్తూ అతనిపై వెంటనే యాక్షన్ తీసుకోండి మేడం అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకొకసారి స్త్రీలను అలాంటి మాటలు మాట్లాడకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.కాగా మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj ) కూడా స్పందించారు.ఈ మేరకు లోకేష్ కూడా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు.

మేమంతా ఒకే టీమ్‌లో పనిచేశాం.మన్సూర్ అలీ ఖాన్ చేసిన స్త్రీల పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చూస్తే చాలా కోపంగా ఉంది.

ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను.మహిళలు, తోటి నటీనటులను మనం గౌరవించాలి.

ఏ పరిశ్రమలోనైనా ఇలాగే ఉండాలి అని రాసుకొచ్చారు లోకేశ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube