గుండు చేయించుకోవాలని రామారావుతో నటించలేదు.. నటుడి కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటుడు లోహిత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సమయానికి నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అని ఆయన చెప్పుకొచ్చారు.అప్పటికే యాక్టింగ్ చేయడం ద్వారా నేను సంపాదిస్తున్నానని ఆయన తెలిపారు.

 Actor Lohith Kumar Comments About Movie With Ramarao Details Here Goes Viral ,-TeluguStop.com

తక్కువ రెమ్యునరేషన్లతో తన కెరీర్ మొదలైందని డిగ్రీ సెకండియర్ సమయానికి నేను భారీ మొత్తంలో సంపాదిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.నెలకు కనీసం 15 నుంచి 20 ప్రోగ్రామ్ లు ఉండేవని లోహిత్ కుమార్ వెల్లడించారు.

ఒక విధంగా ఆరోజుల్లో మంచి అమౌంట్ ను నేను అందుకున్నానని ఆయన పేర్కొన్నారు.నా దగ్గర ఉన్న డబ్బును నేను మరో చోటుకు డైవర్ట్ చేశానని లోహిత్ కుమార్ పేర్కొన్నారు.

డెలివరీ సమయంలో నా భార్యను పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయానని పుట్టిన బాబు ఆరోగ్య సమస్యతో పుట్టాడని లోహిత్ కుమార్ తెలిపారు.ఎక్కడో తప్పు జరగడంతో పాటు నేను ఇచ్చిన డబ్బు నాకు సరైన సమయంలో అంది ఉంటే బాబును కోల్పోయేవాడిని కాదని ఆయన చెప్పుకొచ్చారు.

మాకోసం అమ్మానాన్న ఎన్నో విషయాల్లో రాజీ పడ్డారని నా పిల్లలు ఏది అడిగినా బెస్ట్ ఇవ్వాలని అనుకున్నానని లోహిత్ కుమార్ తెలిపారు.ఆ తర్వాత పాప పుట్టిందని పాప అయినా బాబు అయినా ఒకటే అనుకున్నానని లోహిత్ కుమార్ చెప్పుకొచ్చారు.

నా కూతురుకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చానని ఆయన వెల్లడించారు.బీటెక్ సమయంలో మాత్రం టీచర్లు కూతురి గురించి పాజిటివ్ గా చెప్పారని ఆయన తెలిపారు.

Telugu Lohith Kumar, Pattabhiram, Ramarao, Senior Ntr-Movie

పట్టాభిరామ్ గారి వల్లే నాకు ఎంతోమంది పరిచయం అయ్యారని లోహిత్ కుమార్ చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ తో శ్రీనాథ కవి సార్వభౌమ సినిమాలో మల్లన్న అనే పాత్రలో నటించే ఛాన్స్ వచ్చిందని ఆ పాత్ర కోసం గుండు చేయించుకోవాల్సి ఉండటంతో పాటు తిలకం వేసుకోవాల్సి ఉండటంతో ఆ పాత్రను వదులుకున్నానని లోహిత్ కుమార్ చెప్పుకొచ్చారు.లోహిత్ కుమార్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube