టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో కృష్ణుడు ఒకరనే సంగతి తెలిసిందే.2005 సంవత్సరం నుంచి ఇండస్ట్రీలో ఉన్న కృష్ణుడు హీరోగా కూడా పలు సినిమాల్లో నటించి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.గోపాల గోపాల సినిమా కృష్ణుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది.ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన కృష్ణుడికి సినిమా ఆఫర్లు సైతం తగ్గాయి.
అయితే తాజాగా కృష్ణుడి ఇంట్లో ఓణీల వేడుక జరిగింది.కృష్ణుడు ఫ్యామిలీతో కలిసిన దిగిన ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేయగా కృష్ణుడి కూతురు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కృష్ణుడి కూతురు చాలా క్యూట్ గా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కృష్ణుడి కూతురి వయస్సు పదేళ్లు కాగా ఈ చిన్నారికి సినిమాలపై ఆసక్తి ఉందో లేదో చూడాల్సి ఉంది.

కృష్ణుడి కామెడీ టైమింగ్ కు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా కృష్ణుడు మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కృష్ణుడు కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.కృష్ణుడి ఫ్యామిలీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కృష్ణుడు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలని ఆయన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు.

కృష్ణుడు హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం ఆయన కెరీర్ కు మైనస్ అయింది. ఓణీల ఫంక్షన్ కు పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరయ్యారని సమాచారం అందుతోంది.సినిమా ఇండస్ట్రీని కమెడియన్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో కృష్ణుడు రీఎంట్రీ ఇస్తే కెరీర్ పరంగా సక్సెస్ కావడం సులువు కాదు.కృష్ణుడు తక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
కృష్ణుడి కూతురి పేరు నిత్య అని సమాచారం.







