ఒక రోజు ముందుగానే ప్రభాస్‌ 'అన్‌ స్టాపబుల్‌' సందడి

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌ స్టాపబుల్ కార్యక్రమం ప్రభాస్ ఎపిసోడ్ రేపు స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది.అంటే నేటి అర్ధరాత్రి నుండి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వాలి, కానీ అంతకు ముందే అంటే నేడు రాత్రి 9 గంటల నుండి ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఆహా ఓటీటీ వారు అధికారికంగా ప్రకటించారు.

 Prabhas Unstoppable Episode Interesting From Today Details, Aha Ott, Balakrishna-TeluguStop.com

భారీ ఎత్తున సోషల్ మీడియా లో ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు షో ను ముందుగానే స్ట్రీమింగ్ చేయాలంటూ డిమాండ్ చేయడం తో ఆహా వారు ఓకే చెప్పేశారు.నేడు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

మొదటి నుండి కూడా ఈ ఎపిసోడ్ కోసం అంచనాలు ఓ స్థాయిలో పెంచుకుని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నాయి.ప్రభాస్ రేంజ్ హీరో వచ్చినప్పుడు షో మొత్తం ఒక్క ఎపిసోడ్ తో పూర్తి చేస్తే బాగోదు అనుకున్నారో ఏమో కానీ ప్రభాస్ వచ్చిన ఈ ఎపిసోడ్‌ ను రెండుగా విభజించారు.

నేటి రాత్రి 9 గంటలకు మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది.వచ్చే వారం రెండవ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి రెండు ఎపిసోడ్లు కూడా ఖచ్చితం గా భారీ ఎత్తున సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.

ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఇదే సమయంలో ఆయన నటించిన సలార్ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.మారుతి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు సంబంధించి ఈ ఎపిసోడ్ లో ఆసక్తికర విషయాలను వెల్లడించే అవకాశం ఉంది అంటూ సమాచారం.

మొత్తానికి భారీ ఎత్తున అంచనాలు ఉన్న ప్రభాస్ అన్‌ స్టాపబుల్ ఎపిసోడ్ ఒకరోజు ముందుగానే స్ట్రీమింగ్ అవ్వబోతున్న నేపద్యంలో అభిమానులు పండగ చేసుకోబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube