Actor Kittayya : అమ్మకు క్యాన్సర్ అని తెలియక అలా తిట్టేవాడిని.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో దర్శకుడు సుకుమార్( Director Sukumar ) కూడా ఒకరు.సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో సుకుమార్ స్నేహితుడైన కిట్టయ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.సుకుమార్ వల్లే ఇండస్ట్రీకి వచ్చిన కిట్టయ్య( Kittayya ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగడం సినిమాకు అయితే పారితోషికం తీసుకోలేదని తర్వాత సినిమాలకు మాత్రం పారితోషికం దక్కిందని అన్నారు.100% లవ్ సినిమాకు రోజుకు 1500 రూపాయల రెమ్యునరేషన్ దక్కిందని ఆయన తెలిపారు.నేను సినిమాలలో నటించి ఎక్కువ మొత్తం సంపాదించలేకపోయినా ఖర్చులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని కిట్టయ్య పేర్కొన్నారు.కొంతమంది నిర్మాతలు డబ్బులు ఎగ్గొడతారని అలాంటివి సాధారణం అని ఆయన వెల్లడించారు.

 Actor Kittayya Comments About His Mother Details Here Goes Viral-TeluguStop.com

Telugu Kittayya, Kittayya Mother, Pushpa, Sukumar, Sukumar Friend-Movie

సుకుమార్ ఫస్ట్ లవ్( Sukumar First Love ) గురించి నాకు తెలియదని కాలేజ్ లో సుకుమార్ కు లవ్ స్టోరీ ఉందో లేదో తెలియదని కిట్టయ్య చెప్పుకొచ్చారు.అమ్మాయిలతో సుకుమార్ అస్సలు మాట్లాడేవారు కాదని ఆయన కామెంట్లు చేశారు.సుకుమార్ మ్యారేజ్( Sukumar Love Marriage ) మాత్రం లవ్ మ్యారేజ్ అని కిట్టయ్య పేర్కొన్నారు.కారు లేకపోయినా సుకుమార్ నడిచి వెళ్లిపోతాడని సుకుమార్ విషయంలో భార్య ఎంతో కేరింగ్ తీసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.

సుకుమార్ దంపతులకు ఒక పాప, బాబు అని కిట్టయ్య అన్నారు.ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం సంతోషకరమైన జీవితం అని ఆయన వెల్లడించారు.

Telugu Kittayya, Kittayya Mother, Pushpa, Sukumar, Sukumar Friend-Movie

జీవితంలో బాధాకరమైన క్షణం అంటే బాల్యం అని ఆయన పేర్కొన్నారు.మా అమ్మగారు చనిపోవడం ఎంతో బాధపెట్టిందని కిట్టయ్య చెప్పుకొచ్చారు.బాల్యంలో అమ్మగారిపై కోప్పడేవాడినని నువ్వెప్పుడు లేస్తావ్ అని అనేవాడినని అమ్మకు క్యాన్సర్( Cancer ) అని తెలియక సీరియస్ అయ్యేవాడినని ఆయన కామెంట్లు చేశారు.నేను చేసే కామెంట్ల వల్ల అమ్మ ఏడ్చేదని ఆ సమయంలో నాకు తెలిసేది కాదని కిట్టయ్య పేర్కొన్నారు.

బండరాళ్లు మోసిన వాళ్లకు చిన్నచిన్న కష్టాలు బాధ పెట్టవని ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube